మీరు మంచి స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు జులై 19వ తేదీ వరకు మంచి ఆఫర్లు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్, అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సేల్‌లో అనేక రకాల సైజుల్లో టీవీలను కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు శాంసంగ్, సోనీ, వన్‌ప్లస్, షావోమీ వంటి అనేక బ్రాండ్‌ల ఎల్ఈడీ లేదా స్మార్ట్ టీవీలు ఈ సేల్స్‌లో విక్రయిస్తున్నారు.
65 అంగుళాల మోడల్స్‌లో బెస్ట్ డీల్స్
పెద్ద స్క్రీన్ టీవీని కొనుగోలు చేసే వారికి మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు అమెజాన్‌లో సోనీ బ్రాండ్ స్మార్ట్ టీవీల్లో సోనీ బ్రేవియా 65 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీని రూ.74,990కే కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ 65 అంగుళాల క్రిస్టల్ ఇస్మార్ట్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ ధర రూ.64,990గా ఉంది. వన్‌ప్లస్ 65 అంగుళాల యూ సిరీస్ 4కే ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 65యూ1ఎస్ (బ్లాక్) స్మార్ట్ టీవీని రూ.58,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలన్నిటినీ వాటి అసలు ధర కంటే భారీ తగ్గింపుతో విక్రయిస్తున్నారు.
55 అంగుళాల టీవీలపై ఆఫర్లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 55 అంగుళాల సైజు టీవీలు చాలా ఆకర్షణీయమైన ధరకు అమ్ముడవుతున్నాయి. ఉదాహరణకు మీరు సోనీ 55 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీని కేవలం రూ.55,990కే కొనుగోలు చేస్తున్నారు. మోటొరోలా ఎన్‌విజన్ఎక్స్ 55 అంగుళాల క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీని రూ.34,999కు, ఎల్జీ యూక్యూ7500 55 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ వెబ్ఓఎస్ టీవీ 2022ని రూ.42,999కు కొనేయచ్చు.
43 అంగుళాల టీవీలపై కూడా సూపర్ ఆఫర్లు
మీకు 43 అంగుళాల సైజు టీవీపై ఆసక్తి ఉంటే, అది కూడా చాలా తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు మీరు ఎల్జీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీని అమెజాన్‌లో రూ.28,990కు కొనుగోలు చేయవచ్చు. ఇదే సైజ్ ఉన్న రెడ్‌మీ టీవీని రూ.19,999కు, శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో సిరీస్ స్మార్ట్ టీవీని రూ.29,990కి విక్రయిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో చేసిన కొనుగోళ్లపై అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.
Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial