Crime News :   శామీర్‌పేటలోని సెలబ్రిటీ క్లబ్ విల్లాలో చోటు చేసుకున్న కాల్పుల కేసులో అనేక కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. టీవీ సీరియల్స్‌లో నటించే యాక్టర్ మనోజ్ త సహజీవనం చేస్తున్న మహిళ కుటుంబంకు సంబంధించి అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 


కాల్పులు జరిపిన యాక్టర్ మనోజ్.. స్మిత గ్రంథి అనే మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త   సిద్దార్థ్ దాస్.  భర్తతో విడిపోయిన స్మిత గ్రంథి.. టీవీ యాక్టర్‌ మనోజ్‌తో సహజీవనం చేస్తున్నాురు.  సిద్ధార్థ్‌, స్మితలకు ఒక కొడుకు కూతురు ఉండగా.. పిల్లలను తనకు అప్పగించాలని కొంతకాలంగా సిద్ధార్థ్‌ న్యాయ పోరాటం చేస్తున్నాడు. పిల్లలపై మనోజ్‌ దాడి చేశారంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.                                  


మనోజ్‌పై స్మిత, సిద్ధార్థల  కొడుకు సైతం సంచలన ఆరోపణలు చేశాడు. మనోజ్‌ చిత్రహింసలు పెట్టాడని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి ఫిర్యాదు చేశాడు. స్మిత కొడుకు కూకట్‌పల్లిలోని ఫిడ్జ్‌ కళాశాలలో 12వ తరగతి చదువుతుండగా, కుమార్తె శామీర్‌పేటలోని శాంతినికేతన్‌ రెడిసెన్షియల్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం పిల్లలిద్దరూ చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సంరక్షణలో ఉన్నారు.                                           
 
ఈ క్రమంలో తన పిల్లల కోసం సిద్ధార్థ్‌ విశాఖ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. శంషాబాద్‌లోని సెలబ్రిటీ క్లబ్‌లో ఉంటున్న స్మిత దగ్గకు వెళ్లాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్‌ను చూసి ఆగ్రహించిన సీరియల్‌ నటుడు మనోజ్‌.. ఎయిర్‌ గన్‌తో అతనిపై కాల్పులు జరిపాడు. మనోజ్‌ కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్‌..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మనోజ్‌ మౌన పోరాటం, కార్తీక దీపం వంటి పలు సీరియల్లో నటించాడు.                                


  
సిద్ధార్థ్‌ అతని భార్య స్మితకు 2019 నుంచి విభేదాలు ఏర్పడ్డాయని మేడ్చల్‌ డీసీపీ సందీప్‌ తెలిపారు. దీంతో సిద్ధార్థ్‌ నుంచి విడాకులు కావాలని అదే ఏడాది కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో స్మిత విడాకులు ధరఖాస్తు చేసిందని పేర్కొన్నారు. సిద్ధార్థ్‌ వైజాగ్‌లో హిందూజా థర్మల్ పవర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.  సిద్ధార్థ్‌తో విడిపోయిన తర్వాత స్మిత మనోజ్‌తో  స్మిత గ్రంథి సహజీవనం చేస్తున్నారు. పిల్లలను కూడా తన వద్దే ఉంచుకోవడంతో సమస్యలు ప్రారంభమయ్యాయి.