Flight Emergency Exit: 


కాసేపు టెన్షన్ టెన్షన్..


హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్ కాసేపు అందరినీ టెన్షన్ పెట్టాడు. టేకాఫ్ అయ్యే సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ని తెరిచాడు. ఇది చూసి ఒక్కసారిగా ప్రయాణికులు వణికిపోయారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమవడం వల్ల ఘోర ప్రమాదం తప్పింది. నిందితుడు 40 ఏళ్ల హుస్సేన్‌ని ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సెక్యూరిటీకి  అప్పగించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వద్ద కూర్చున్న హుస్సేన్..ఉన్నట్టుండి దాన్ని ఓపెన్ చేశాడు. ఇది గమనించిన క్రూ ఆయనకు వార్నింగ్ ఇచ్చి వేరే సీట్‌లో కూర్చోబెట్టింది. ఎగ్జిట్ డోర్‌ కవర్‌ని మళ్లీ మూసేసింది. సాధారణంగా ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ డోర్ తెరుచుకునేలా దానిపై ఓ కవర్‌ అమర్చుతారు. అది కేవలం ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. కానీ హుసేన్ మాత్రం దాన్ని మాన్యువల్‌గా ఓపెన్ చేశాడు. ఈ కవర్‌ని తీసేస్తే ఘోర ప్రమాదం జరిగే అవకాశముందని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెల్లడించింది. 


"ఎగ్జిట్ డోర్ కవర్‌ని తీసేయడం చాలా ప్రమాదకరం. విమానం గాల్లో ఉండగా అది తెరుచుకుంటే ఆ పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడం అసాధ్యం. అందుకే పొరపాటను కూడా దాన్ని తెరిచే సాహసం చేయకూడదు. నిజానికి అది అంత సులువుగా తెరుచుకోదు. కానీ ఆ వ్యక్తి ఎలా తెరిచాడన్నదే మిస్టరీగా ఉంది. ఎమర్జెన్సీ డోర్‌ పక్కన కూర్చునే ప్రయాణికులకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూనే ఉంటాం. పొరపాటున కూడా డోర్ తెరవకూడదని చెప్తాం. అయినా ఇలా ప్రవర్తించారంటే కచ్చితంగా ఇది కావాలని చేసినట్టే. మిగతా ప్రయాణికులనూ ప్రమాదంలోకి తోసినట్టే"


- ఎయిర్‌పోర్ట్ సిబ్బంది


గతంలోనూ...


Asiana Airlines ఫ్లైట్‌లోనూ ఇలాంటి ఘటన జరిగింది. మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ఉన్నట్టుండి ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు ఓ ప్రయాణికుడు. ఒక్కసారిగా ప్యాసింజర్స్‌ అందరూ ఉలిక్కిపడ్డారు. ఫ్లైట్ సేఫ్‌గానే ల్యాండ్ అయినప్పటికీ...డోర్ తెరవడం వల్ల గాలి గట్టిగా వీచి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ల్యాండ్ అయిన వెంటనే కొందరు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో Airbus A321-200లో 200 మంది ప్రయాణికులున్నారు. Daegu International Airport రన్‌వేపై ల్యాండ్ అయ్యే సమయంలో ఇది జరిగింది. ఎమర్జెన్సీ డోర్‌కి పక్కనే కూర్చుని ఉన్న ఓ ప్రయాణికుడు ఫ్లైట్...నేలకు 650 అడుగుల ఎత్తులో ఉండగానే మాన్యువల్‌గా ఆ డోర్‌ని తీశాడు. అనుకోకుండా డోర్ ఓపెన్ అవడం వల్ల ప్రయాణికులంతా కంగారు పడ్డారు. శ్వాస తీసుకోవడంలో చాలా మంది ఇబ్బందికి గురయ్యారు.అయితే..ఎవరికీ గాయాలు అవ్వలేదని, ఫ్లైట్‌కి కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదని ఏషియానా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. సౌత్‌కొరియాకు చెందిన Yonhap News Agency ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిపింది. 9 మందిని ఆసుపత్రిలో చేర్చినట్టు వివరించింది. ఆ డోర్‌ని ఓపెన్ చేసిన ప్యాసింజర్‌ని పోలీసులకు అప్పగించారు. 


Also Read: PM Modi Dubai Visit: ప్రధాని మోదీ యూఏఈ పర్యటనపై ఎన్నో అంచనాలు, ఆ రంగంలో కీలక ఒప్పందాలు!