PM Modi Dubai Visit: 



మోదీకి ఘనస్వాగతం..


ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అటు నుంచి దుబాయ్‌కి వెళ్లారు. అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన ప్రధాని మోదీకి అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఘనంగా స్వాగతం పలికారు.





ఈ పర్యటనలో భాగంగా మోదీ, మహమ్మద్ బిన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆహార భద్రత, రక్షణ రంగంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకునే విధంగా ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. వాణిజ్యం విషయంలోనూ కీలక ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. ప్రధాని యూఏఈ పర్యటనపై విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. యూఏఈ, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుందని, ప్రధాని మోదీ పర్యటనతో అది ఇంకాస్త ముందుకెళ్తుందని వెల్లడించింది. 


"భారత్, యూఏఈ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రధాని మోదీ పర్యటనతో ఆ బంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా విద్య, హెల్త్‌కేర్, ఆహార భద్రత,రక్షణ రంగాలపై ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి."


- భారత విదేశాంగ శాఖ 











ఆ రెండు సదస్సులపై చర్చ..


ఇదే పర్యటనలో ప్రధాని మోదీ అంతర్జాతీయ అంశాల గురించీ చర్చించనున్నారు. COP-28 సదస్సుకి యూఏఈ అధ్యక్షత వహించనుంది. అటు G20 సమ్మిట్‌ని భారత్ లీడ్ చేయనుంది. అందుకే...ఈ రెండు సదస్సులపైనా కీలక చర్చలు జరపనున్నారు మోదీ. ఫ్రాన్స్‌లో రెండ్రోజుల పాటు పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఫ్రాన్స్‌లో UPI చెల్లింపులు చేసేలా కొత్త చట్టం తీసుకురానున్నారు. దీంతో పాటు మిలిటరీ విషయంలోనూ ఇరు దేశాలు పరస్పరం సహకరించుకునేలా ఒప్పందాలు కుదిరాయి. ఫ్రాన్స్, భారత్ మధ్య ద్వైపాక్షిక బంధాలు మొదలై పాతికేళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించారు. ఫ్రాన్స్ మోదీని ఘనంగా స్వాగతించడమే కాకుండా అత్యున్నత అవార్డుతో సత్కరించింది. 


Also Read: Delhi Floods: మూడు రోజుల వర్షానికే ఢిల్లీ ఇలా అవుతుందా, ఇవి బీజేపీ స్పాన్సర్ చేసిన వరదలు - ఆప్ ఆరోపణలు