ఎయిర్‌టెల్ తన ఎక్స్‌ట్రీమ్ బాక్స్ ధరను భారీగా తగ్గించింది. దీని అసలు ధర రూ.2,499 కాగా రూ.499 తగ్గింపును అందించారు. దీంతో ఇప్పుడు ఈ బాక్స్ రూ.2,000కే అందుబాటులో ఉంది. ఇది ఒక డైరెక్ట్ టు హోం సెట్ టాప్ బాక్స్. ఈ బాక్స్‌తో ఓటీటీ యాప్స్‌కు యాక్సెస్ కూడా లభించనుంది. అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లకు సబ్‌స్క్రిప్షన్ కూడా దీంతో అందించారు. ఈ బాక్స్ 2019 సెప్టెంబర్‌లో లాంచ్ అయింది. అప్పట్లో దీని ధర రూ.3,999గా ఉండేది.


ప్రస్తుతం ఈ బాక్స్‌ను రూ.2,000కే కొనుగోలు చేయవచ్చని ఎయిర్‌టెల్ వెబ్ సైట్‌లో చూపిస్తుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, ఎరోస్ నౌ, హంగామా ఇతర ఓటీటీ యాప్స్‌ను కూడా ఈ కొత్త స్ట్రీమ్ బాక్స్‌తో కొనుగోలు చేయవచ్చు.


దీంతో ఒక సంవత్సరం పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్, మూడు నెలల అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, ఎరోస్ నౌ, హంగామాలకు చెందిన సబ్‌స్క్రిప్షన్లు లభించనున్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బాక్స్ ఆండ్రాయిడ్ 9.0 ఆధారిత టీవీ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నాయి. ఇందులో గూగుల్ ప్లే స్టోర్‌ను ప్రీలోడెడ్‌గా అందించనున్నారు. దాదాపు 5,000 వరకు యాప్స్, గేమ్స్‌కు యాక్సెస్ లభించనుంది. ఇందులో క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా అందించారు.


దీంతోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బాక్స్ డీటీహెచ్ సర్వీసెస్‌ను కూడా అందించనుంది. వినియోగదారులు ఎయిర్‌టెల్ డీటీహెచ్ ఖాతాను రీచార్జ్ చేసుకోవడం ద్వారా ఓటీటీ కంటెంట్‌తో పాటు డీటీహెచ్ సేవలను కూడా పొందవచ్చు. అయితే దీనికి కనీసం రూ.153తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.


ఎయిర్‌టెల్ గత నెలలోనే ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. 15 భారతీయ, గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫాంలకు దీని ద్వారా యాక్సెస్ అందించనున్నారు. దీని సబ్ స్క్రిప్షన్ నెలకు రూ.149 కాగా... సంవత్సరానికి రూ.1,499గా ఉంది.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?