ప్రముఖ భారతీయ  టెలికాం సంస్థ  ఎయిర్‌టెల్‌  మూడు కొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. అవే రూ.1599, రూ.1,099, రూ.699 ప్లాన్లు. ఈ ప్లాన్ల ద్వారా ఎయిర్‌టెల్‌ 4కే ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో అన్‌లిమిటెడ్ డేటా, 350కి పైగా చానెళ్లను ఫ్రీగా చూడవచ్చు. ఈ ప్లాన్లు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే  17 ప్రీమియం  ఓటీటీలకు కూడా యాక్సెస్ లభిస్తుంది. ఎయిర్‌టెల్‌  అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్లాన్లను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.


ఎయిర్‌టెల్ రూ. 1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లాభాలు
ఎయిర్‌టెల్  రూ. 1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌‌కు  రూ.1,498 ప్లాన్‌ల లాభాలు దాదాపు ఒకటే. కానీ, రూ.1,599 ప్లాన్ ద్వారా 4కే ఎక్స్‌స్ట్రీమ్  బాక్స్‌తో 350కి పైగా చానెళ్లను ఎంజాయ్ చేయవచ్చు. అయితే దీని కోసం వన్‌టైం చార్జ్ రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సెట్ టాప్ బాక్స్‌తో, వినియోగదారులు కేబుల్ టీవీతో పాటు  ఓటీటీ  కంటెంట్‌ను కూడా ఎంజాయ్‌ చేయొచ్చు.


ఈ ప్లాన్ ద్వారా 300ఎంబీపీఎస్‌ ఇంటర్నెట్ స్పీడ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ , డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి టాప్‌ ఓటీటీలు ఉచితంగా పొందవచ్చు. సోనీ లివ్, ఈరోస్ నౌ, లయన్స్‌గేట్ ప్లే, హొయ్‌చొయ్, మనోరమ మ్యాక్స్, షెమారూ, అల్ట్రా, హంగామా ప్లే, ఎపికాన్, దివో టీవీ, క్లిక్, నమ్మఫ్లిక్స్, డాలీవుడ్, షార్ట్స్ టీవీ లాంటి  17 ఓటీటీలు ఉచితంగా లభిస్తాయి. దీంతోపాటు నెలకు 3.3 టీబీ (దాదాపు 3,300 జీబీ) డేటా వాడుకోవచ్చు.


రూ.1099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లాభాలు
ఈ ప్లాన్ ద్వారా నెలకు 200 ఎంబీపీఎస్‌ వేగంతో  3.3 టీబీ డేటా లభిస్తుంది. పై ప్లాన్ ద్వారా లభించే అన్ని ఓటీటీలూ దీని ద్వారా కూడా లభిస్తాయి. ఇక ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆఫర్ ద్వారా 350కి పైగా చానెల్స్‌  కూడా ఉచితం.


రూ.699 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లాభాలు
ఈ మూడిట్లో అత్యంత చవకైన ప్లాన్ ఇదే. ఈ ప్లాన్ ద్వారా 40 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో నెలకు 3.3 టీబీ డేటా  పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మినహా పై రెండు ప్లాన్లలో లభించే అన్ని ఓటీటీలు, టీవీ చానెల్స్‌కు యాక్సెస్‌  ఉంటుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!