Big Battery Smartphones: స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు, కొనుగోలుదారులు సాధారణంగా ఫోన్ కెమెరా, బ్యాటరీ ఫీచర్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ప్రాసెసర్, డిస్‌ప్లే, యాక్సెసరీ ఫీచర్లు కూడా ఉంటాయి కానీ ఎక్కువ దృష్టి ఈ రెండిటిపైనే ఉంటుంది. టెక్నాలజీ నిపుణులు తెలుపుతున్న దాని ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ముందుగా చూడవలసినది బ్యాటరీ. ఎందుకంటే మన రోజువారీ జీవితంలో దాదాపు చాలా కార్యకలాపాలు ఫోన్‌ల్లోనే జరుగుతున్నాయి. వర్క్‌ప్లేస్‌లో కూడా ఎక్కువ భాగం ఫోన్ మీదనే ఆధారపడి పనులు జరుగుతూ ఉంటాయి.


అందుకే రోడ్డుపై ఫోన్ పెట్టుకుని బయటకు వెళ్తే ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి దీని కోసం బ్యాటరీ బ్యాకప్‌ను కూడా చూడాలి. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో అనేక ఫోన్లు ఇప్పుడు భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. ఈ శక్తివంతమైన బ్యాటరీతో పలు కంపెనీలు ఫోన్‌లను విడుదల చేశాయి. వీటిలో కొన్నిటిపై ఓ లుక్కేద్దాం.


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ (Samsung Galaxy F14 5G)
ఈ ఫోన్‌లో శాంసంగ్ సొంత ఎక్సినోస్ 1330 ప్రాసెసర్ ఉంది. ఇది 6 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ ఉన్న 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ డిస్‌ప్లే కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్-సిరీస్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ఫోన్ డిస్‌ప్లే పైన ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ అందించారు. దీని ధర రూ.13,999 నుంచి ప్రారంభం కానుంది.


మోటొరోలా జీ54 (Motorola G54)
ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ ఉంది. ఇది 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. మోటొరోలా జీ54 ఫోన్‌లో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉన్న 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌లో క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ కెమెరా ఫీచర్ అందించారు. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్ ఉంది. ముందువైపు ఫోన్ డిస్‌ప్లేలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంది. మోటో జీ54 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ ఉన్న 6.55 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.


పోకో ఎం3 (Poco M3)
ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ అందించారు. ఇది 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. పోకో ఎం3 ఫోన్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ ఉన్న 6.53 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో వెనక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి.


రియల్‌మీ సీ12 (Realme C12)
ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ అందించగలదు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ53 ప్రాసెసర్ ఉంది. ఇది 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో వెనక వైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో పాటు, రెండు 2 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్లు అందించారు. ఫోన్ ముందువైపు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ ఉన్న 6.52 అంగుళాల డిస్‌ప్లేను అందించారు.


షావోమీ రెడ్‌మీ 10 పవర్ (Xiaomi Redmi 10 Power)
ఈ ఫోన్‌లో 18W ఛార్జింగ్ సపోర్ట్‌ ఉన్న 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో 6 ఎన్ఎం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. ఇందులో 11 జీబీ వరకు ర్యామ్ ఉండనుంది. ఈ ఫోన్‌లో వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్, 6.71 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!