దేశంలో 5G సేవలు మొదలయ్యాయి. రోజు రోజుకు 5G నెట్ వర్క్ పరిధి పెరుగుతున్నది. మార్కెట్లోనూ 5G ఫోన్లకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న, అదీ రూ.15 వేలలోపు లభించే 5G స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Redmi Note 10T 5G
ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ధర రూ. 11, 999. ఇందులో 6.5-అంగుళాల IPS LCD స్క్రీన్ ఉంది. 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. f/1.79 అపెర్చర్‌తో 48MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2MP మాక్రో కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం, ఇది f/2.0 ఎపర్చర్‌తో కూడిన 8MP ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. MediaTek డైమెన్సిటీ 700 MT6833 CPUతో, 4GB RAM, 64GB ఇన్ బిల్ట్ మెమరీతో వస్తున్నది. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 1TBకి వరకు స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఉంది.
POCO M4 5G
POCO M4 5G ఇన్ బిల్ట్ డైమెన్సిటీ 700 CPU, UFS 2.2 రైట్‌బూస్టర్, 2 GB వరకు టర్బో ర్యామ్ ను కలిగి ఉంటుంది. మల్టీ టాస్కింగ్‌ను బ్రీజ్ చేస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్‌తో మంచి ఫోటోలను తీసుకునే అవకాశం ఉంది. 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీని ధర రూ. 12,999.
iQOO Z6 5G
iQOO Z6 5G 6.58-అంగుళాల IPS LCD స్క్రీన్ ను కలిగి ఉంటుంది. టాప్ సెంటర్‌లో వాటర్ డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. 1080 x 2408 పిక్సెల్స్ రిజల్యూషన్, 401ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. 50MP f/1.8 వైడ్ యాంగిల్ ఐ AF కెమెరా, 2MP f/2.4 మాక్రో కెమెరా, 2MP f/2.4 డెప్త్ కెమెరాతో ట్రిఫుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్, 16MP f/2.0 వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. Qualcomm Snapdragon 695 CPUను కలిగి ఉంటుంది. . 4GB RAMతో వస్తుంది. 5000mAh Li-ion బ్యాటరీతో వస్తుంది. దీని ధర సుమారు రూ. 13,999.
Vivo T1 5G
ఈ స్మార్ట్ ఫోన్ 6.58-అంగుళాల IPS LCD ను కలిగి ఉంటుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. f/1.8 ఎపర్చరుతో కూడిన 50MP వైడ్-యాంగిల్ ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, f/2.4 ఎపర్చర్‌లతో కూడిన 2MP మాక్రో కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 16MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా 2.0 ఎపర్చరుతో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పాటు బెస్ట్ ఇన్ క్లాస్ 4GB RAMని కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.14,999.
Read Also: స్నానమంటే బద్దకమా? ఈ మిషన్‌లో పడుకుంటే చాలు, అదే స్నానం చేయించేస్తుంది
Realme 9 5G
Realme 9 5G IPS LCD 20:9 యాస్పెక్ట్ రేషియో, 405ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. 48MP f/1.8 మెయిన్ కెమెరా, 2MP f/2.4 మాక్రో కెమెరా, 2MP f/2.4 డెప్త్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఫిక్స్‌డ్ ఫోకస్‌తో 16MP f/2.1 సెల్ఫీ షూటింగ్ లెన్స్ ఉంది. MediaTek డైమెన్సిటీ 810 సీపీయూతో 4GB RAM ను కలిగి ఉంది. లి-పాలిమర్ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. దీని ధర రూ. 14,990.