భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ దంపతులు తమ బిడ్డ పేరును సోషల్ మీడియాలో ప్రకటించారు. వీరికి మగబిడ్డ పుట్టినట్లు యువీ గత నెలలోనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇప్పుడు ఈ బాబుకు ‘ఓరియన్ కీచ్ సింగ్’ అని పేరు పెట్టారు.


యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ దంపతులకు 2015లో ఎంగేజ్ మెంట్ అయింది. 2016 నవంబర్ 30వ తేదీన వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2021లో భార్యతో ఉండటం కోసం దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో లగ్జరీ పెంట్‌హౌస్‌ను యువీ కొనుగోలు చేశాడు.