Satyasai District Crime : సత్యసాయి జిల్లాలో దారుణం, మర్మాంగాలు కోసి యువకుడి హత్య

ABP Desam   |  Satyaprasad Bandaru   |  19 Jun 2022 03:05 PM (IST)

Satyasai District Crime : సత్యసాయి జిల్లా బీచిగాని పల్లిలో దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడిని దుండగులు అత్యంత అతికిరాతకంగా గొంతు, మర్మాంగాలను కోసి హత్య చేశారు.

సత్యసాయి జిల్లాలో దారుణ హత్య

Satyasai District Crime : శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండలం బీచిగాని పల్లిలో యుగంధర్(21) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి గ్రామ శివారుకు పిలిపించి అతి కిరాతకంగా గొంతు, మర్మాంగాలను కోసి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు గురైన యుగంధర్ కియా కంపెనీలో లేబర్ గా పని చేసేవాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. హిందూపురం అర్బన్ సీఐ జీటీ నాయుడు, చిలమత్తూరు ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

గ్రామ శివారులో 

పరిగి మండలం బిచిగాని పల్లి అనే గ్రామంలో యుగంధర్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ శివారులో హత్య చేశారు. యువకుడిని మేడ, ఇతర పార్టుల్లో కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కేసు విచారణ చేస్తున్నాం. గొంతుతో పాటు శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. మర్మాంగాన్ని కూడా కోశారు. - -సీఐ జీటీ నాయుడు

పెళ్లై 24 గంటలు కాకముందే వరుడు మృతి

శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం పెద్ద కొల్లివలస గ్రామానికి చెందిన పవన్ కుమార్ తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. శ్యామలపురం గ్రామానికి చెందిన బలగ యోగేశ్వరి అనే యువతితో పవన్ కుమార్ కు శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. అయితే ఆరు నెలల కిందట పవన్ పెద్దలను ఎదిరించి అమ్మాయిని తన సొంత గ్రామానికి తీసుకొచ్చాడు. అనంతరం ఇద్దరూ సహజీవనం చేశారు. రెండు నెలలుగా ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు రాజీ ప్రయత్నాలు చేయడం వారి పెళ్లికి అంగీకరించారు. దీంతో ఈ నెల 17వ తేదీ రాత్రి పవన్, యోగేశ్వరి వివాహం జరిగింది. వివాహం అనంతరం పెళ్లి కుమార్తె బంధువులు అందరూ బస్సులో స్వగ్రామానికి వచ్చారు. వరుడు, వధువు బైక్ పై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో వరుడికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుడు మరణించాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వివాహం జరిగి 24 గంటలు గడవకముందే వరుడు మృత్యు ఒడికి చేరడంతో మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read : Watch Video: రియల్ సింగం, ఎస్ఐపై పెద్ద కత్తితో దాడి - చాకచక్యంగా తప్పించుకుని నిందితుడి ఆటకట్టించిన SI

Also Read: Delhi News: డిన్నర్ పెట్టలేదని దిండుతో చంపేశాడు, డెడ్‌బాడీ పక్కనే నిద్రపోయాడు

 

Published at: 19 Jun 2022 02:56 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.