BCCI Central Contract: 2022 సంవత్సరానికి బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. ఈ కాంట్రాక్టుల్లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాదే (Hardik Pandya) అతి పెద్ద పతనం. తను ఏకంగా గ్రేడ్-ఏ నుంచి గ్రేడ్-సికి పడిపోయాడు. దీంతోపాటు ఎప్పటి నుంచో ఫాంలో లేక ఇబ్బంది పడుతున్న అజింక్య రహానే (Ajinkya Rahane), చతేశ్వర్ పుజారాలు (Cheteshwar Pujara) కూడా గ్రేడ్-ఏ నుంచి గ్రేడ్-సీకి పడిపోయాడు.


ప్రస్తుతం బీసీసీఐ నాలుగు కేటగిరిల్లో కాంట్రాక్టులను అందిస్తుంది. ఏ+ కేటగిరిలో ఉన్నవారికి సంవత్సరానికి రూ.7 కోట్ల వార్షిక పారితోషికం లభిస్తుంది. గ్రేడ్-ఏలో ఉన్నవారికి రూ.ఐదు కోట్లు, గ్రేడ్-బిలో ఉన్నవారికి రూ.మూడు కోట్ల వార్షిక వేతనం, గ్రేడ్-సిలో ఉన్నవారికి రూ.కోటి వార్షిక వేతనం అందుతుంది.


పుజారా, రహానే ఫాంలో లేకపోవడంతో త్వరలో జరగనున్న శ్రీలంక టెస్టు సిరీస్‌కు కూడా వీరిని జట్టులోకి తీసుకోలేదు. ఇటీవలే బీసీసీఐపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) కాంట్రాక్టులో కూడా వేటు పడింది. తను ఇటీవలే టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. దీంతోపాటు గ్రూప్-బి నుంచి గ్రూప్-సికి డిమోట్ అయ్యాడు.