World Wrestling Championships 2022: ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2022 పోటీలు ఈరోజు బెల్‌గ్రేడ్‌లో ప్రారంభం కానున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 800 మంది మహిళా రెజ్లర్లు ఈ సిరీస్‌లో పాల్గొంటారు. ఈ టోర్నీలో పలువురు ప్రముఖ క్రీడాకారులు పాల్గొననున్నారు. 


నేటి నుంచి గ్రీకో-రోమన్ డివిజన్ రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత 13వ తేదీ నుంచి ఫ్రీస్టైల్ రెజ్లింగ్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. బజరంగ్ పునియా, రవి దహియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ సహా పలువురు భారత ఆటగాళ్లు ఇందులో ప్రాతినిథ్యం వహిస్తున్నారు.


భారత పురుషుల ఫ్రీస్టైల్ జట్టు: 


రవి దహియా (57 కేజీల వెయిట్ కేటగిరీ), పంకజ్ మాలిక్ (61 కేజీల వెయిట్ కేటగిరీ), బజరంగ్ పునియా (65 కేజీల వెయిట్ కేటగిరీ), నవీన్ మాలిక్ (70 కేజీల వెయిట్ కేటగిరీ), సాగర్ జగ్లాన్ (74 కేజీల వెయిట్ కేటగిరీ), దీపక్ మిర్కా (79 కేజీలు) , దీపక్ పునియా (86 కేజీలు), విక్కీ హుడా (92 కేజీలు), విక్కీ చాహర్ (97 కేజీలు), దినేశ్ థాంకర్ (125 కేజీల వెయిట్ కేటగిరీ)



మహిళల ఫ్రీస్టైల్ జట్టు: 


వినేష్ ఫోగట్ (53 కేజీల వెయిట్ కేటగిరీ), సుష్మా చోకీన్ (55 కేజీల వెయిట్ కేటగిరీ), సరితా మోరే (57 కేజీల వెయిట్ కేటగిరీ), మాన్సీ అహల్వాడ్ (59 కేజీల వెయిట్ కేటగిరీ), సోనమ్ మాలిక్ (62 కేజీల వెయిట్ కేటగిరీ), షెఫాలీ (65 కేజీల వెయిట్ కేటగిరీ) కేటగిరీ), నిషా దహియా (68 కేజీల వెయిట్ కేటగిరీ), రితిక (72 కేజీల వెయిట్ కేటగిరీ), ప్రియాంక (76 కేజీల వెయిట్ కేటగిరీ)


గ్రీకో-రోమన్ ఇండియన్ టీమ్:


అర్జున్ హలకుర్గి (55 కేజీల వెయిట్ కేటగిరీ), జ్ఞానేందర్ (60 కేజీల వెయిట్ కేటగిరీ), నీరజ్ (63 కేజీల వెయిట్ కేటగిరీ), అషు (67 కేజీల వెయిట్ కేటగిరీ), వికాస్ (72 కేజీల వెయిట్ కేటగిరీ), సచిన్ (77 కేజీల వెయిట్ కేటగిరీ), హర్ ప్రీత్ సింగ్ (82 కేజీల వెయిట్ కేటగిరీ), సునీల్ కుమార్ (87 కేజీల వెయిట్ కేటగిరీ), దీపాంషి (97 కేజీల వెయిట్ కేటగిరీ) సతీష్ (130 కేజీల వెయిట్ కేటగిరీ) 


నేటి నుంచి 3 రోజుల పాటు గ్రీకో-రోమన్ డివిజన్ రెజ్లింగ్ పోటీలు జరగనున్నాయి. దీని తర్వాత ఫ్రీస్టైల్ రెజ్లింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. చివరిగా 2021లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు కేవలం ఒక రజతం, ఒక కాంస్యం మాత్రమే గెలుచుకుంది. ఈ సారి ఆ సంఖ్యను మార్చాలని భారత రెజ్లింగ్ టీం భావిస్తోంది.