Prithvi Shaw Sapna Gill Selfie Case Update: భారత క్రికెటర్ పృథ్వీ షా ఇటీవల వైరల్ వీడియో కారణంగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఈ వీడియోలో పృథ్వీ షా, ఒక యువతి మధ్య వాగ్వాదం జరుగుతోంది. పృథ్వీ షాతో వాగ్వాదానికి దిగిన యువతి మరెవరో కాదు యువ నటి సప్నా గిల్. ఈ వీడియోలో పృథ్వీ షాతో సప్నా గిల్ వాగ్వాదానికి దిగినట్లు స్పష్టంగా కనిపించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పృథ్వీ స్నేహితుడు చిత్రీకరించాడు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. కాగా ఈ కేసులో సంబంధిత యువ నటి సప్నా గిల్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
భారత క్రికెటర్ పృథ్వీ షా ప్రస్తుతం టీమ్ ఇండియా జట్టులో లేడు. నటి సప్నా గిల్‌తో వివాదం కారణంగా ప్రస్తుతం పృథ్వీ షా వార్తల్లో నిలిచారు. ముంబై వీధుల్లో ఇద్దరి మధ్య చాలా బలంగా వాగ్వాదం జరిగింది. పృథ్వీ స్నేహితుడి కారు అద్దాలను సప్నా గిల్ పగులగొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత నటి సప్నా గిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సప్నా గిల్ ఎవరు? (Who is Sapna Gill)
సప్నా గిల్ భోజ్‌పురి నటి, మోడల్. సప్నా తన గ్లామర్, నటనతో భోజ్‌పురి పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సప్నా గిల్ వయసు 26 ఏళ్లు. సప్నా పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో జన్మించింది. భోజ్‌పురి సూపర్ స్టార్ నటుడు రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్‌తో కలిసి'కాశీ అమర్‌నాథ్', 'నిర్హువా చలాల్ లండన్' వంటి సినిమాల్లో సప్నా గిల్ నటించింది. ఆమెకు ఇంకా అంత మంచి పేరు రాలేదు. అయితే పృథ్వీ షాతో వివాదాల కారణంగా సప్నా గిల్ వెలుగులోకి వచ్చింది.
పృథ్వీ షా, సప్నా గిల్ సెల్ఫీ కేసు ఏంటి?
భారత క్రికెటర్ పృథ్వీ షా ఓ యువతితో వాగ్వాదానికి దిగాడు. ముంబైలోని ఓ హోటల్ బయట ఈ ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకోవడంపైనే ఈ వాదన జరిగినట్లు తెలుస్తోంది. పృథ్వీ షాతో సెల్ఫీ దిగుతుండగా తోపులాట జరిగినట్లు సమాచారం.
మీడియా నివేదికల ప్రకారం ఈ సంఘటన జోగేశ్వరి లింక్ రోడ్‌లోని లోటస్ పెట్రోల్ పంప్ సమీపంలో జరిగినట్లు సమాచారం. పృథ్వీ షా స్నేహితుడు తెలిపిన వివరాల ప్రకారం ఓ హోటల్‌లో పార్టీ చేసుకుంటూ సెల్ఫీ తీసుకునే విషయంలో పృథ్వీ షా వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పృథ్వీ షా హోటల్ నుంచి కారులో ఇంటికి వెళ్తున్నాడు. పృథ్వీ షా స్నేహితుడి కారులో ఉన్నాడని భావించిన బంధువులు, యువతి, ఆమె స్నేహితులు కలిసి వారంతా వేరే కారుపై దాడి చేశారు.
అనంతరం యువతికి, పృథ్వీకి మధ్య వాగ్వాదం జరిగినట్లు మరో వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనపై పృథ్వీ స్నేహితులు ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత యువతి, ఇతరులపై కేసు నమోదు చేశారు. సప్నా గిల్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయని పోలీసులు అంటున్నారు.