Virat Kohli Steps Down as Test Captain:  టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీ తప్పుకోవడం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. హఠాత్తుగా అతడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడోనని అంతా ఆశ్చర్య పోతున్నారు. ఇక అభిమానులైతే హార్ట్‌ బ్రేక్‌ అయిందంటూ పోస్టింగులు పెడుతున్నారు. మరోవైపు అతడి సేవలను కొనియాడుతూ చాలామంది మాజీ క్రికెటర్లు, ఆటగాళ్లు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.


'టెస్టు జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నాయకత్వ లక్షణాలను బీసీసీఐ అభినందిస్తోంది. అతడి కెరీర్‌ పట్ల అభినందనలు తెలియజేస్తున్నాం. భారత జట్టును అతడు 60 మ్యాచుల్లో నడిపించాడు. 40 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు' అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది.


'నువ్వేమైనా చేయి. టెస్టు క్రికెట్‌ నుంచి మాత్రం వెళ్లిపోవద్దు. కనీసం కొన్నైళ్ల వరకైనా ఆడాలి. నీ నిష్క్రమణను తట్టుకొనేందుకు మేం రెడీగా లేము' అని గౌరవ్‌ కపూర్‌ అన్నాడు.


'విరాట్‌ కోహ్లీ కొన్ని అలవాట్లు పాటించాడు. అవిప్పుడు సంస్కృతిగా మారిపోయాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం, అభిరుచి, దూకుడుగా నువ్వు జట్టును నడిపించావు. ఈ భారత జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చావు. ఈ రోజు తీసుకున్న నిర్ణయం షాకే!! నీ మిగిలిన అంతర్జాతీయ క్రికెట్‌ బాగా సాగాలి' అని టీమ్‌ఇండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ అన్నాడు.


ఇంకా ఎవరెవరు ఏం ట్వీట్‌ చేశారంటే..!