దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపి దీవెనలు తీసుకుంటున్నారు. రక్షా బంధన్ సందర్భంగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సోదరి భావన కోహ్లీ కూడా ఈ రోజు తన సోదరులను గుర్తు చేసుకుంది.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భావన తన ఇద్దరు సోదరులతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపింది. వీరితో పాటు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సామాజిక మాధ్యమాల ద్వారా తమ సోదరీమణులకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.