Virat Kohli Most Popular Cricketer In 2022: భారత జట్టు దిగ్గజ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. కోహ్లీ తన బ్యాటింగ్‌తో కోట్లాది మందిని ఫ్యాన్స్‌గా మార్చుకున్నాడు. కింగ్ కోహ్లి తన బ్యాటింగ్‌తో చాలా ముఖ్యమైన సందర్భాల్లో భారత జట్టుకు విజయాన్ని అందించాడు. మైదానంలో కోహ్లీ ఎప్పుడూ నంబర్‌వన్‌గా ఉంటాడు. ఇప్పుడు ఫీల్డ్ బయట కూడా నంబర్ వన్ అయ్యాడు. 2022లో మోస్ట్ పాపులర్ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
విరాట్ కోహ్లికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో 230 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. క్రికెటర్లలో ప్రస్తుతానికి విరాట్ కోహ్లీకే అత్యధికంగా ఫాలోయర్లు ఉన్నారు. తన అద్భుతమైన బ్యాటింగ్ చూసి ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. అతని వల్లే ఆర్సీబీని కూడా ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. విరాట్ కోహ్లి లాగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో 2022లో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ జట్టుగా నిలిచింది. కోహ్లి తన ఐపీఎల్ కెరీర్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతోనే ప్రారంభించాడు. అతను ఇప్పటికీ RCB తరఫునే ఆడటం చూడవచ్చు.
వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో విరాట్ కోహ్లీతో సహా భారత జట్టులోని చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఐపీఎల్ 2023లోని కొన్ని మ్యాచ్‌లను ఆడకపోవచ్చు. ఆటగాళ్ల పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ ఏడాది భారత టీ20 జట్టుకు కూడా విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది విరాట్ ఇప్పటి వరకు ఒక్క టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు.
విరాట్ కోహ్లీకి ఇప్పటివరకు 2023 అద్భుతమైన సంవత్సరంగా ఉంది. ఇప్పటివరకు అతను 2023లో మొత్తం ఆరు వన్డేలు ఆడాడు. వీటిలో రెండు సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ఆటతీరు మనదేశంలో జరిగే ప్రపంచ కప్ 2023లో జట్టుకు చాలా సహాయకారిగా ఉంటుంది. ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీ పేరు మీద పెవిలియన్ పెట్టారు. విరాట్ కోహ్లీ గౌరవార్థం ఈ పెవిలియన్‌కు విరాట్ కోహ్లీ పెవిలియన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, ముంబై జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతోంది. ఈ పెవిలియన్‌కు విరాట్ కోహ్లీ పెవిలియన్ అని పేరు పెట్టాలని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు.
నిజానికి క్రికెట్ గ్రౌండ్స్‌లో చాలా మంది మాజీ ఆటగాళ్ల పేర్లతో పెవిలియన్‌లు ఉన్నాయి. కానీ ప్రస్తుత ఆటగాడి పేరు మీద పెవిలియన్‌లు పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. విరాట్ కోహ్లీ పెవిలియన్‌పై అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని నిరంతరం తెలియజేస్తున్నారు.