టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ శుక్రవారం 3 పతకాలు సాధించింది. దీంతో మొత్తం 13 పతకాలతో 37వ స్థానంలో కొనసాగుతోంది. శనివారం అందరి చూపు పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్ పైనే. పురుషుల సింగిల్స్ SL3 సెమీఫైనల్లో ప్రమోద్ తలపడనున్నాడు. సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ చేరాలని కోరుకుందాం. అలాగే ఇదే విభాగంలో మరో సెమీఫైనల్లో మనోజ్ సర్కార్ ఉన్నాడు. వీరిద్దరూ గెలిస్తే మధ్యాహ్నం 3గంటలకు ఫైనల్లో స్వర్ణం కోసం తలపడతారు. లేదంటే కాంస్య పతకం కోసం ఢీకొట్టుకుంటారు.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్ 1 ఫైనల్‌లో కాంస్యం సాధించింది. ఒకే పారాలింపిక్స్ టోర్నీలో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా అవనీ లేఖరా చరిత్ర సృష్టించింది.
Also Read: Praveen Kumar Wins Silver Medal: భారత్ ఖాతాలో మరో పతకం.. హై జంప్‌లో ప్రవీణ్ కుమార్‌కు రజతం
మరి శనివారం ఎవరు పతకం రేసులో నిలుస్తారో? ఎవరు ఎవరితో తలపడుతున్నారో? ఇప్పుడు చూద్దాం.
7:45 AM | Badminton: Men's singles SL4: Semi-finals: India (s. Yathiraj) vs Indonesia (F. Setiawan)
7:00 AM | Badminton: Men's singles SL3: Semi-finals: India (M Sarkar) vs USA (D. Bethell)