భారత్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.  84 ఓవర్లకు ఇంగ్లాండ్ 290 పరుగుల వద్ద   ఆలౌటైంది. ఓలీ పోప్ (81, 159 బంతుల్లో), బౌలర్ క్రిస్ వోక్స్ (50, 60 బంతుల్లో) అర్ధ శతకాలతో రాణించారు. అంతకుముందు బెయిర్‌స్టో (37; 77 బంతుల్లో), మొయిన్‌ అలీ (35; 71 బంతుల్లో) కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయడంతో ఇంగ్లాండ్‌.. భారత్‌పై 99 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్, బుమ్రాకి చెరో 3, జడేజాకి రెండు, శార్దూల్ ఠాకూర్, సిరాజ్‌కి చెరో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. 






టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 290 పరుగులకు ఆలౌటైంది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఓలీపోప్‌ (81; 159 బంతుల్లో 6x4), క్రిస్‌వోక్స్‌ (50; 60 బంతుల్లో 11x4) అర్ధ శతకాలతో మెరిశారు. అంతకుముందు బెయిర్‌స్టో (37; 77 బంతుల్లో), మొయిన్‌ అలీ (35; 71 బంతుల్లో) కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయడంతో ఇంగ్లాండ్‌.. భారత్‌పై 99 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో ఉమేశ్‌ మూడు.. బుమ్రా, జడేజా రెండు వికెట్లు తీయగా శార్దూల్‌, సిరాజ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.


అంతకుముందు 55/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ ఆదిలోనే ఓవర్టన్‌ (1), డేవిడ్‌ మలన్‌ (31) వికెట్లను కోల్పోయింది. ఉమేశ్‌ ఈ ఇద్దర్నీ ఔట్ చేసి భారత అభిమానుల్లో ఆశలు రేపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పోప్‌(81) నిలకడగా ఆడి ఆ జట్టు మంచి స్కోర్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బెయిర్‌స్టోతో కలిసి ఆరో వికెట్‌కు 89 పరుగులు జోడించిన అతడు తర్వాత మొయిన్‌ అలీతో కలిసి ఏడో వికెట్‌కు 76 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే కీలక సమయాల్లో ఈ ముగ్గురూ ఔటైనా చివర్లో క్రిస్‌ వోక్స్‌ ధాటిగా ఆడి ఏకంగా అర్ధ శతకం నమోదు చేసి ఇంగ్లాండ్‌‌కు మంచి ఆధిక్యాన్ని అందించాడు.