Tokyo Olympic 2020 LIVE: ‘కాంస్య’ సింధు... టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకున్న సింధు... పతక పోరులో రెండు వరుస సెట్లలో విజయం

టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం గెలిచింది. స్వర్ణ పతకమే లక్ష్యంగా టోక్యో ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన సింధు సెమీఫైనల్లో ఓడి పసిడి పతకానికి దూరమైంది.

ABP Desam Last Updated: 01 Aug 2021 05:42 PM
11-8 తో రెండో సెట్ లో సింధు ఆధిపత్యం

రెండో సెట్‌లో సింధు 11-8తో బ్రేక్ తీసుకుంది. రెండో సెట్ కోసం ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు.

హోరాహోరీగా రెండో సెట్

కాంస్య పోరులో సింధుXబింగ్జియావో పోరు హోరాహొరీగా సాగుతోంది. తొలి సెట్ ను బింగ్జియావో కోల్పోయింది. దీంతో రెండోసెట్ ఆధిపత్యం కోసం ప్రత్యర్థి పోరాడుతోంది.

ప్రత్యర్థి స్వీయ తప్పిదాలు

కాంస్య పోరులో సింధు... ప్రత్యర్థి బింగ్జియావో అనవసర తప్పిదాలు చేస్తోంది. దీంతో పాయింట్లు సమర్పించుకుంటోంది.

21-13తో తొలి సెట్ సింధు సొంతం

కాంస్యం కోసం జరుగుతోన్న పోరులో పీవీ సింధు తొలి సెట్‌ను 21-13తో కైవసం చేసుకుంది. 

11- 8తో బ్రేక్ తీసుకున్న సింధు

తొలి సెట్‌లో సింధు  11- 8తో బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతానికి ప్రత్యర్థిపై సింధుదే పైచేయి

4-1తో సింధు ఆధిక్యం

ప్రస్తుతం సింధు 4-1 ఆధిక్యంతో ముందంజలో ఉంది

సింధు కాంస్య పోరు ప్రారంభం

కాంస్యం కోసం చైనా క్రీడాకారిణి బింగ్జియావోతో సింధు పోరు ప్రారంభమైంది

5-0తో బాక్సర్ సతీశ్ ఓటమి

ఒలింపిక్స్ క్వార్టర్‌లో భారత బాక్సర్ నిరాశపరిచాడు. 91 కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ జలొలోవ్ చేతిలో 5-0 తేడాతో సతీశ్ ఓడిపోయాడు.

రజతం కోసం హి బింగ్జియావో తో పోరు

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో ఆదివారం తలపడనుంది. 

సింధు పరాజయం

సెమీఫైనల్లో పీవీ సింధు పరాజయం పాలైంది. మాజీ నెంబర్ తై జు యింగ్ పై సింధు రెండు వరుస సెట్లలో ఓడింది.

తొలి సెట్లో తైజు విజయం

తొలి సెట్లో తై జు యింగ్ 21-18తో సింధుపై విజయం సాధించింది. 

తొలి సెట్‌లో 11 - 8 బ్రేక్‌కు వచ్చిన సింధు

తొలి సెట్లో సింధు 11-8 తేడాతో బ్రేక్ తీసుకుంది. 

మ్యాచ్ ప్రారంభం

టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు X తై జు యింగ్ మ్యాచ్ ప్రారంభమైంది. 

చివరి పోరు ఎప్పుడు జరిగింది?

సింధు X తైజు యింగ్ వీరిద్దరూ చివరిసారిగా దిల్లీలో జరిగిన BWF ప్రపంచ టూర్ ఫైనల్స్ - 2020లో తలపడ్డారు. ఈ మ్యాచ్లో సింధు 21-19, 12-21, 17-21 తేడాతో ఓడిపోయింది. 

వరుసగా రెండు సెట్ల విజయం

టోక్యో ఒలింపిక్స్‌లో సింధు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో వరుసగా రెండు సెట్లలో విజయం సాధించింది. 

సింధుపై తైజు దే పైచేయి

సింధు X తై జు యింగ్ ఇప్పటి వరకు 18 సార్లు తలపడ్డారు. అందులో 15 సార్లు తై జుదే పైచేయి. 

Background

టోక్యో ఒలింపిక్స్‌ మరో 8 రోజుల్లో ముగియనుండటంతో పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. భారత క్రీడాకాభిమానుల కోసం ఆసక్తికరమైన పోరు సిద్ధమైంది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోరు సెమీఫైనల్ చేరింది. ఇందులో భాగంగా శనివారం సింధు... మాజీ నంబర్ వన్, చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌తో తలపడనుంది. ఇప్పటి వరకు వీరిద్దరూ 18 మ్యాచుల్లో తలపడ్డారు. అందులో 15 సార్లు తైజుదే పైచేయి. కేవలం 3 సార్లు మాత్రమే సింధు విజయం సాధించింది. మరి, ఈ రోజు మ్యాచ్లో విజయం ఎవరిది?  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.