Tokyo Olympics 2020 HighLights: చాను రజతం... స్వర్ణం కానుందా? ప్రిక్వార్టర్స్ చేరిన శరత్ కమల్

Tokyo Olympics 2020 LIVE Updates: ప్రి క్వార్టర్స్ చేరిన శరత్ కమల్... పురుషుల ఆర్చరీలో నిరాశ

ABP Desam Last Updated: 27 Jul 2021 09:56 AM
టోక్యో బయల్దేరిన నీరజ్ చోప్రా

భారత స్టార్ జావలిన్ త్రోయర్ ప్లేయర్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్ కోసం టోక్యో బయల్దేరాడు. జపాన్‌కి బయల్దేరేముందు అతడు ఎయిర్ పోర్టులో దిగిన ఫొటోను పంచుకున్నాడు. 



 

భారత్ చేరుకున్న మీరాబాయి చాను

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చాను జపాన్ నుంచి భారత్ చేరుకున్నారు. 

నిరాశపరిచిన స్విమ్మర్ సజన్ ప్రకాశ్

భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్ నిరాశపరిచాడు. సెమీఫైనల్ కోసం నిర్వహించిన పోటీల్లో అతను అర్హత సాధించలేకపోయాడు. 



చాను రజతం... స్వర్ణం కానుందా?

టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను రజతం గెలుచుకుంది. ఐతే, ఈ రజతం... స్వర్ణమయ్యే అవకాశం ఉంది. అది ఎలాగంటే...స్వర్ణం గెలిచిన చైనా లిఫ్టర్ జీహుహోను డోపింగ్ టెస్టుకు పంపాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ టెస్టులో ఆమె డోపీగా తేలితే ఆమె గెలిచిన స్వర్ణాన్ని చానుకు ఇచ్చేస్తారు.



మూడో రౌండ్లో మనిక బాత్ర ఓటమి

ఒలింపిక్స్‌లో భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా పోరు ముగిసింది. సింగిల్స్ 3వ రౌండ్లో బాత్ర 0-4 తేడాతో ఆస్ట్రియా క్రీడాకారిణి సోఫియాపై ఓడిపోయింది. 



టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి చానుకు రాజ్యసభ్య శుభాకాంక్షలు తెలిపింది.  


బ్యాడ్మింటన్: పురుషుల డబుల్స్‌లో సాత్విక్ - చిరాగ్ జోడీ ఓటమి

పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ పరాజయం పాలైంది. ఇండోనేషియాపై  21-13, 21-12 తేడాతో ఓడిపోయింది. 

రెండో రౌండ్లో సుమిత్ నగాల్ ఔట్

పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నగాల్ ఓడిపోయాడు. రష్య ఆటగాడు డానిల్ మెద్వైత్‌పై వరుసగా రెండు సెట్లలో ఓడిపోయాడు. 



జపాన్ క్రీడాకారిణి మొమిజి నిషియా రికార్డు

ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన రెండో పిన్న వయస్కురాలిగా మొమిజి రికార్డు సష్టించింది. 

స్కేట్ బోర్డింగ్‌లో 14 ఏళ్ల మొమిజికి స్వర్ణం 

జపాన్‌కి చెందిన 14 ఏళ్ల మొమిజి నిషియా బంగారు పతకం సాధించింది. స్కేట్ బోర్డింగ్‌లో ఆమె స్వర్ణం దక్కించుకుంది. 



భారత్‌కు పయనమైన చాను

రజతం సాధించిన మీరాబాయి చాను తిరిగి భారత్‌కు పయనమైంది.

Tokyo Olympics 2020 Live Updates

భారత ఏస్ షూటర్లు అహ్మద్‌, అంగద్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. క్వాలిఫికేషన్ కోసం నిర్వహించిన పోరులో వీరిద్దరూ 25, 18 స్థానాలతో సరిపెట్టుకున్నారు.  

క్వార్టర్ ఫైనల్లో ఆర్చరీ పురుషుల జట్టు ఓటమి

టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల ఆర్చరీ జట్టు పోరు ముగిసింది. అతాను దాస్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌ జట్టు క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో ఘోర పరాజయం మూటకట్టుకుంది

రెండో రౌండ్లో ఫెన్సర్ భవానీ ఓటమి

ఒలింపిక్స్‌లో భారత ఏకైక ఫెన్సర్‌ భవానీ దేవి స్ఫూర్తిదాయక ప్రదర్శన ముగిసింది. తొలి రౌండ్లో ఘన విజయం సాధించిన ఆమె రెండో రౌండ్లో ఓటమి పాలైంది. ప్రపంచ మూడో ర్యాంకర్‌తో పోరాడి వెనుదిరిగింది. 

ఆర్చరీలో క్వార్టర్స్ చేరిన భారత పురుషుల జట్టు

ఒలింపిక్స్‌ ఆర్చరీ పోటీల్లో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. అతాను దాస్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌తో కూడిన బృందం ప్రిక్వార్టర్స్‌లో 6-2 తేడాతో కజక్‌స్థాన్‌ను ఓడించింది. క్వార్టర్స్‌లో అత్యంత బలమైన, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కొరియాతో తలపడనుంది. ఈ పోరులో గెలిస్తే భారత్‌కు కచ్చితంగా పతకావకాశం ఉంటుందని చెప్పొచ్చు!

రెండో రౌండ్‌లో సుతీర్థ ఓటమి

టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సుతీర్థ ముఖర్జీ రెండో రౌండ్లో ఓడిపోయింది. 

సోమవారం టీమిండియా షెడ్యూల్


ఆస్ట్రేలియాపై భారత్ ఓటమి

పురుషుల హాకీ రెండో మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. భారత్ 1-7తేడాతో ఓడిపోయింది

Tokyo Olympics LIVE: మనిక బాత్రా రికార్డు

టేబుల్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో ఒలింపిక్స్‌లో మూడో రౌండ్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా మనిక బాత్రా నిలిచింది. ఈ రోజు జరిగిన రెండో రౌండ్లో ర్యాంకింగ్స్ లో తనకంటే మెరుగైన క్రీడాకారిణిన మనిక మట్టికరిపించింది. మూడో రౌండ్ గెలిస్తే మనికకు పతకం ఖాయమౌతోంది.



విజయంతో మేరీ కోమ్ బోణీ

51 కేజీల మహిళల బాక్సింగ్ విభాగం తొలి రౌండ్లో మేరీ కోమ్ విజయం సాధించింది. డామినిక రిపబ్లిక్ క్రీడాకారిణి పై 4-1తేడాతో విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. 



మనిక బాత్రా ముందంజ

టేబుల్ టెన్నిస్ మహిళల వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో మనిక బాత్రా విజయం సాధించింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి పై 4-3 తేడాతో గెలిచి మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది.



టేబుల్ టెన్నిస్... రెండో రౌండ్‌లో సత్యన్ ఔట్

టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు సత్యన్ రెండో రౌండ్లో ఓడిపోయాడు.  



నెగిటివ్ రిపోర్టు వస్తేనే భారత్‌కి

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తాజాగా క్రీడా మంత్రికి ఓ లేఖ రాసింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న మన క్రీడాకారులు తిరిగి భారత్‌లో అడుగుపెట్టాలంటే తప్పనిసరిగా RT-PCR నెగిటివ్ వస్తేనే అనుమతి ఇవ్వాలని లేఖలో కోరింది.  

పతకం గెలిచిన అనంతరం మీరాబాయ్ చాను మాట్లాడుతూ... తాను వెంటనే పిజ్జా తినాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో డామినోస్ పిజ్జా చానుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. లైఫ్ లాంగ్ మీరాబాయ్ చానుకు పిజ్జా ఫ్రీగా ఇస్తామని తెలిపారు. 


 


ప్చ్... నిరాశపరిచిన దివ్యాన్ష్, దీపక్

పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత ఆటగాళ్లు దివ్యాన్ష్ పన్వార్, దీపక్ కుమార్ ఫైనల్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. 32, 26 స్థానాలతో సరిపెట్టుకున్నారు.

ఒడిశాలోని పూరీకి చెందిన 14 ఏళ్ల నందినీ పట్నాయక్ సుమారు 10వేళ ఐస్ పుల్లలతో టోక్యో ఒలింపిక్స్ స్టేడియం ఆకృతి తయారు చేసింది.
సింగిల్స్ నుంచి తప్పుకున్న అండీ ముర్రే

బ్రిటీష్ టెన్నిస్ ఆటగాడు అండీ ముర్రే టోక్యో ఒలింపిక్స్‌లో సింగిల్స్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

చానుకి మణిపూర్ ప్రభుత్వం కోటి నజరానా

టోక్యో ఒలింపిక్స్‌లో రతజం సాధించిన భారత క్రీడాకారిణి మీరాబాయి చానుకు మణిపూర్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది

నిరాశపరిచిన ప్రణతి నాయక్

భారత జిమ్నాస్టిక్ క్రీడాకారిణి ప్రణతి నాయక్ క్వాలిఫై రౌండ్లోనే వెనుదిరిగింది. ఆదివారం ఫైనల్ కోసం నిర్వహించిన మ్యాచ్‌లోనే ఆమె క్వాలిఫై అవ్వలేకపోయింది. 

వింబుల్డన్ ఛాంపియన్ బార్టీకి షాక్

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ వింబుల్డన్ ఛాంపియన్ బార్టీ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. స్పెయిన్ క్రీడాకారిణి సారా చేతిలో 4-6, 3-6 తేడాతో పరాజయం పాలైంది.  

దుమ్ము రేపిన భారత్‌ రోయర్లు

రోయింగ్​లో భారత రోయర్లు అరుణ్​ లాల్​, అర్వింద్​ సింగ్​ జంట దుమ్ము రేపింది. పురుషుల లైట్​వెయిట్​ డబుల్​ స్కల్స్​ రెపిచేజ్​ రౌండ్​లో టాప్​-3లో నిలిచి సెమీఫైనల్​కు దూసుకెళ్లింది. జులై 27న ఈ పోటీలు జరగనున్నాయి. 

సానియా జోడీకి షాక్‌... తొలి రౌండ్‌లోనే ఓటమి

టెన్నిస్​ మహిళల డబుల్స్​ తొలి రౌండ్​లో సానియా మీర్జా- అంకితా రైనా జోడీ ఓటమిపాలైంది. ఉక్రెయిన్​కు చెందిన కిచునాక్ లియుద్​మ్యాలా- కిచునాక్ నదియా జోడీ చేతిలో 0-6, 7-6, (10-8) తేడాతో ఓడిపోయింది.

ప్చ్‌... మనుబాకర్, యశస్విని

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. మనుబాకర్‌, యశస్విని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మనుబాకర్‌ 12వ స్థానంలో, యశస్విని 13వ స్థానంలో నిలిచారు.

ఒలింపిక్స్‌లో సింధు శుభారంభం

టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు పతకం వేట స్టార్ట్ చేసింది. గ్రూప్‌-జె తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై విజయం సాధించింది. 21-7, 21-10 తేడాతో సింధు జయకేతనం ఎగరేసింది.

భారత మహిళా హాకీ జట్టు ఓటమి

భారత మహిళా హాకీ జట్టుకి మొదటి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. పటిష్టమైన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-5 తేడాతో ఓడింది భారత వుమెన్స్ హాకీ టీమ్.  

సుశీలా దేవీ ఓటమి

టోక్యో ఒలింపిక్స్‌లో భారత జూడో ప్లేయర్ సుశీలా దేవీ పోరాటం ముగిసింది. మహిళల 48 కేజీల విభాగంలో హంగేరియాన్ ఎవా సెనోవిక్‌జీతో జరిగిన 32 రౌండ్ మ్యాచ్‌లో ఓడిన సుశీలా దేవి, పోటీ నుంచి నిష్కమించింది.

ఉత్కంఠభరితంగా మ్యాచ్... సుత్రీత విజయం

టీటీ మహిళల సింగిల్స్‌లో సుత్రీత ముఖర్జీ, స్విడెన్ ప్లేయర్ బెర్‌స్టోమ్‌తో జరిగిన మ్యాచ్‌ ఏడు సెట్ల పాటు ఉత్కంఠభరితంగా సాగించినా చివరకు విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. 

ఒలింపిక్ విన్నర్ మీరాబాయ్ ఛాను ఎమోషనల్ ట్వీట్
తొలి రౌండ్లోనే వికాస్ కృష్ణన్ ఔట్

భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. 69 కేజీల మెన్స్ బాక్సింగ్ విభాగంలో జపాన్‌కి చెందిన ఒకాజవా మెన్షాతో జరిగిన మ్యాచ్‌లో వికాస్ కృష్ణన్ మూడు రౌండ్లలో ఓడి, ఒలింపిక్స్ నుంచి నిష్కమించాడు.

పతక విజేతల కోచ్‌లకు ప్రైజ్ మనీ

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన క్రీడాకారులకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పతకం గెలిచిన క్రీడాకారుల కోచ్‌లకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. స్వర్ణం గెలిచిన క్రీడాకారుడి కోచ్‌కి రూ.12.5లక్షలు, రజతం గెలిచిన క్రీడాకారుడి కోచ్‌కి రూ.10లక్షలు, కాంస్యం గెలిచిన క్రీడాకారుడి కోచ్‌కి రూ.7.5లక్షలు ఇవ్వనుంది.   

29 ఏళ్ల తర్వాత తొలి విజయం

1992 తర్వాత ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో తొలి రౌండ్లో గెలిచిన క్రీడాకారిణి మనికా బత్రా

అర్హత పోటీల్లో అగ్రస్థానం... పోటీ నుంచి నిష్క్రమణ

అర్హత పోటీల్లో సత్తా చాటిన యువ షూటర్‌ సౌరభ్‌ చౌదరి.. రెండో ఎలిమినేషన్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. దీంతో పోటీ నుంచి నిష్క్రమించాడు.

సింగిల్స్‌లో ముందుకు... మిక్స్‌డ్ డబుల్స్‌లో ఔట్

టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత్‌ విజయం సాధించింది. గ్రేట్‌ బ్రిటన్‌ క్రీడాకారిణి టిన్‌ టిన్‌ హోపై 4-0తో మనికా బాత్రా గెలుపొందింది. అయితే అంతకుముందు టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శరత్‌ కమల్‌ - మనికా బాత్రా ద్వయం ఓటమిపాలైంది.

టెన్నిస్‌లో నాగల్‌ చారిత్రక విజయం

టెన్నిస్‌లో భారత ఆటగాడు సుమిత్ నాగల్‌ సత్తా చాటాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్‌ క్రీడాకారుడు డెన్నిస్‌ ఇస్తోమిన్‌పై 6-4, 6-7, 6-4 తేడాతో నాగల్‌ గెలుపొందాడు. ఒలింపిక్‌ క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో విజయం సాధించిన భారత మూడో ఆటగాడు ఇతడే కావడం విశేషం. అంతకుముందు 1988 సియోల్‌ గేమ్స్‌లో జీషన్‌ అలీ, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్‌ పేస్‌ సింగిల్స్‌ విభాగంలో విజయం సాధించారు. ఆ ఏడాది పేస్‌ కాంస్య పతకం కూడా సాధించాడు. 25ఏళ్ల తర్వాత నాగల్‌ మళ్లీ తొలి రౌండ్‌లో విజయం సాధించి ఒలింపిక్‌ పతకంపై ఆశలు రేపుతున్నాడు.

చానుకు సచిన్ శుభాకాంక్షలు

చాను ప్రదర్శనతో భారతం ఉప్పొంగిపోతోంది: మోదీ

టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

చానుకు రాష్ట్రపతి అభినందనలు

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌.

3-2తో హాకీ జట్టు ఘన విజయం

పురుషుల హాకీలో న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో భారత్ ఘన విజయం సాధించింది. 3-2 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.

ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ముగిసిన భారత్‌ పోరు

ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ పోరు ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్‌లో దక్షిణ కొరియా చేతిలో దీపిక కుమారి, ప్రవీణ్‌ జాదవ్‌ జోడీ 2-6 తేడాతో ఓటమిపాలైంది. 

సాయి ప్రణీత్ ఔట్

బ్యాడ్మింటన్ పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత షట్లర్‌ సాయి ప్రణీత్‌ నిరాశపర్చాడు. ఇజ్రాయెల్‌ ఆటగాడు జిల్‌బర్మన్‌ మిషా చేతిలో 17-21, 15-21 తేడాతో ఓటమిపాలయ్యాడు.

వరల్డ్‌ నం. 3 జోడీకి చిరాగ్‌- సాత్విక్‌‌ షాక్‌

బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ప్రపంచ నంబరు 3 జోడీపై చిరాగ్‌ శెట్టి - సాత్విక్‌ ద్వయం విజయం సాధించింది. చైనీస్‌ తైపీ ఆటగాళ్లు యాంగ్‌ లీ - చిన్‌ లిన్‌ వాంగ్‌ జోడీపై 21-16, 16-21, 27-24తో గెలుపొందింది.

Background

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేట మొదలైంది. శనివారం వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను దేశానికి రజత పతకాన్ని అందించింది. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి.. ఫస్ట్ అటెంప్ట్‌లో 110 కేజీలు, సెకండ్ అటెంప్ట్‌లో 115 కేజీలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ.. ఫైనల్ అటెంప్ట్‌లో మాత్రం 117 కేజీలను లిప్ట్ చేయడంలో మీరాబాయి విఫలమైంది. దాంతో.. ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చైనాకి చెందిన హౌ జిహూయ్‌కి స్వర్ణం లభించింది.





భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో‌ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఈ ఒలింపిక్స్‌లో సత్తాచాటే అథ్లెట్లకి భారత ఒలింపిక్ సంఘం నగదు పురస్కారాలని ఇప్పటికే ప్రకటించేసింది. స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు, రజతానికి రూ.40 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు చొప్పున అథ్లెట్లకి ఇవ్వనున్నట్లు తెలిపింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.