టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం భారత్‌కు ఎంతో కీలకం. బ్యాడ్మింటన్, బాక్సింగ్‌తో పాటు పలు పోటీల్లో పతకం ఖాయం అయ్యే అవకాశాలు ఉన్న పోటీలు 29న జరగనున్నాయి. దీంతో భారత క్రీడాభిమానులందరూ రేపటి పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం ఏ ఏ క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి? ఏ భారత క్రీడాకారుడు ఎవరితో తలపడుతున్నారు? ఏ సమయానికి ఆ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయో ఇప్పుడు చూద్దాం.
షూటింగ్: 25మీ. పిస్టల్(రహి సర్నోబత్, మను బాకర్) క్వాలిఫికేషన్ రాపిడ్ - ఉదయం 5.30 నుంచి
ఆర్చరీ: మహిళల వ్యక్తిగత విభాగం(దీపిక కుమారి) ఉదయం 7.31 నుంచి
అథ్లెటిక్స్: పురుషుల 3000మీ. స్టీపుల్ ఛేజ్ రౌండ్ - హీట్ - 2 (అవినాష్ ముకుంద్ సబ్లే) ఉదయం 6.17నుంచి
హాకీ: మహిళల పూల్ ఎ (భారత్ - ఐర్లాండ్) ఉదయం 8.15నుంచి
* పురుషుల పూల్ ఎ (భారత్ - జపాన్) మధ్యాహ్నం 3 నుంచి
బాక్సింగ్: మహిళల లైట్ వెయిట్ (57-60కేజీలు) రౌండ్-16(సిమ్రన్‌జిత్ కౌర్) ఉదయం 8.18 నుంచి
అథ్లెటిక్స్: పురుషుల 400మీటర్ల హర్డిల్స్ రౌండ్ - 1 - హీట్ 5 (MP Jabir) ఉదయం 8.27 నుంచి
* 4X400మీటర్ల రిలే మిక్స్‌డ్ రౌండ్ 1 - హీట్ - 2(రేవతి, సుభా వెంకటేశమ్, అలెక్స్, సర్థక్ బాంబ్రీ) సాయంత్రం 4.42 నుంచి
సెయిలింగ్: మహిళల వ్యక్తిగత డింగీ లేసర్ రాడియల్ - రేస్ 9, 10(నేత్ర కుమనన్) ఉదయం 8.35 నుంచి
* పురుషుల స్కిఫ్ - రేస్ - 7, 8, 9,10 (గణపతి - వరుణ్) ఉదయం 8.35 నుంచి
బాక్సింగ్: మహిళల వెల్టర్(64-69కేజీ) క్వార్టర్ ఫైనల్ - 2(లవ్లీనా) ఉదయం 8.48 నుంచి
గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ - 2(అనీర్‌బన్ లహిరి, ఉదయన్ మనె) ఉదయం 8.52 నుంచి
షూటింగ్: మహిళల 25మీటర్ల పిస్టల్ ఫైనల్ (క్వాలిఫికేషన్ ఆధారంగా) ఉదయం 10.30నుంచి
బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ పీవీసింధు - యమగూచి మధ్యాహ్నం 1.15 నుంచి
ఈక్వెస్ట్రియాన్: వ్యక్తిగత ఈవెంటింగ్ డ్రసేజ్ టీమ్ ఫౌవాద్ మిర్జా సాయంత్రం 5.30 నుంచి
మరి, ఎవరు విజయం సాధించి పతకాలు ఖాయం చేసుకుంటారో తెలియాలంటే రేపటి మ్యాచ్లు జరిగే వరకు వేచి చూడాల్సిందే. ఒకటి లేదా రెండు విభాగాల్లో శుక్రవారం భారత్‌కు పతకాలు ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏ కేటగిరీల్లో మన ఆటగాళ్లు పతకాలు ఖాయం చేసుకుంటారో. పీవీ సింధుతో పాటు లవ్లీ పతకాలు ఖాయం చేసుకునేందుకు ముందంజలో ఉన్నారు.