Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు డబుల్ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు వీరే.

Continues below advertisement

Border Gavaskar Trophy Record: ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్ గురించి చర్చలు బాగా జరుగుతున్నాయి. భారత గడ్డపై జరగనున్న ఈ సిరీస్‌పై పలు విషయాల గురించి ఇప్పటికే మాటట్లాడుకుంటున్నారు. దీనిపై పలువురు మాజీ ఆటగాళ్లు, క్రికెట్ పండితులు తమ అంచనాలు చెప్తున్నారు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో డబుల్ సెంచరీలు చేసిన మాజీ భారత ఆటగాళ్ల గురించి తెలుసుకోండి.

Continues below advertisement

ద్విశతక వీరులు వీరే..
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఆడుతూ భారత మాజీ ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, మహేంద్ర సింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్ డబుల్ సెంచరీలు సాధించారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వీవీఎస్ లక్ష్మణ్ 2001లో 281, 2008లో 200 నాటౌట్ పరుగులు చేశాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సచిన్ టెండూల్కర్ 2004లో 241 నాటౌట్, 2010లో 214 పరుగులు చేశాడు.

ప్రస్తుత భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ 2003లో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఆడుతున్నప్పుడు 224 పరుగులు సాధించాడు.

2008లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గౌతమ్ గంభీర్ ఇన్నింగ్స్ 206 పరుగులు చేశాడు.

2013లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 224 పరుగులు సాధించాడు.

2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ మధ్య ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక మూడో టెస్టు మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 5వ తేదీ దాకా ధర్మశాలలో జరగనుంది. మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ దాకా అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.

దీని తర్వాత రెండు జట్లూ మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనున్నాయి. ఈ సిరీస్‌లో తొలి వన్డే ముంబైలో, రెండో వన్డే విశాఖపట్నంలో, మూడో వన్డే చెన్నైలో జరగనుంది. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత జట్టు వద్ద ఉంది. చివరిసారిగా ఆస్ట్రేలియా జట్టును సొంతగడ్డపై ఓడించి టీమిండియా సిరీస్‌ను గెలుచుకుంది.

ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి రెండు టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.

భారత పర్యటనకు ఆస్ట్రేలియా టెస్టు జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషగ్నే, నాథన్ లియోన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్.

Continues below advertisement