Top 5 Mileage Bikes: దేశంలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. ఎందుకంటే దేశంలోని చాలా మంది ప్రజలు తమ రోజువారీ జీవిత అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడానికి ఇష్టపడతారు. ఈ సెగ్మెంట్‌లో అధిక మైలేజ్ ఇచ్చే కమ్యూటర్ బైక్‌లకు చాలా డిమాండ్ ఉంది. కాబట్టి ఈరోజు మనం అధిక మైలేజీతో మార్కెట్‌లో ఉన్న అలాంటి కొన్ని మోటార్‌సైకిళ్ల గురించి తెలుసుకుందాం.


టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
టీవీఎస్ స్పోర్ట్‌కు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. ఈ బైక్‌లో 109.7 సీసీ బీఎస్6 ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 8.18 bhp శక్తిని, 8.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనికి రెండు వైపులా డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్ మార్కెట్‌లో మూడు వేరియంట్లు, ఏడు రంగులలో అందుబాటులో ఉంది. ఇది 10 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను పొందుతుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.61,025 నుంచి మొదలై రూ.67,530 వరకు ఉంటుంది. ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.


హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 97.2cc BS6 ఇంజన్‌తో వచ్చింది. ఇది 7.91 బీహెచ్‌పీ పవర్, 8.05 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనికి ముందు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు అందించారు. ఈ బైక్ మార్కెట్‌లో ఐదు వేరియంట్లు, 10 రంగులలో వస్తుంది. ఇది 9.1 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో లాంచ్ అయింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 55,022 నుంచి రూ. 67,178. ఇది లీటర్ పెట్రోలుకు 65 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు.


హోండా ఎస్‌పీ 125 (Honda SP 125)
హోండా SP 125 బైక్‌లో 124cc BS6 ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 10.72 bhp పవర్, 10.9 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీని బ్రేకింగ్ సిస్టంలో ముందు, వెనుక రెండు వైపులా డ్రమ్ బ్రేక్‌లనే అందిస్తారు. ఈ బైక్ మార్కెట్‌లో రెండు వేరియంట్లు, ఐదు రంగులలో వస్తుంది. ఇది 11 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను పొందుతుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,702 నుంచి రూ.83,088 మధ్య ఉండనుంది. ఇది 65 కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది.


హోండా లివో (Honda Livo)
హోండా లివో మార్కెట్లో రెండు వేరియంట్లు, నాలుగు రంగులలో వస్తుంది. ఇది 109.51 సీసీ BS6 ఇంజిన్‌తో లాంచ్ అయింది. ఇది 8.67 bhp పవర్, 9.30 Nm టార్క్‌ను డెలివర్ చేస్తుంది. బైక్‌కు ముందు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ బైక్‌లో తొమ్మిది లీటర్ల ఇంధన ట్యాంక్ అందుబాటులో ఉంది. దీని ప్రారంభ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.75,659గా ఉంది. ఇది 58 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు.


హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ (Hero Splendor Plus Xtec)
ఇది స్ప్లెండర్ బైక్ అధునాతన వెర్షన్. ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. కలర్ ఆప్షన్లు మాత్రం నాలుగు ఉన్నాయి. ఈ బైక్‌లో 97.2 సీసీ BS6 ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 7.9 bhp పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ వెనుక, ముందు భాగంలో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన డ్రమ్ బ్రేక్ అందుబాటులో ఉంది. ఇందులో 9.8 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని అందించారు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.76,381గా ఉంది. ఇది లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది.