కొద్ది రోజుల క్రితం బార్సిలోని ఫుట్‌బాల్ క్లబ్‌కి గుడ్ బై చెప్పిన మెస్సీ ... తర్వాత ఏ క్లబ్ తరఫున బరిలోకి దిగుతాడా అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అతడు పారిస్ సెయింట్ జర్మన్ (PSG)తో అగ్రిమెంట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. మరో కొన్ని గంటల్లోనే ఈ అగ్రిమెంట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. 


అర్జెంటీనాకు చెందిన మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. తన 17 ఏళ్ల వయసులో 2004లో బార్సిలోనా  క్లబ్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు మొత్తం 17 సీజన్లు ఆడాడు. వివిధ లీగుల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బార్సిలోనా క్లబ్ తరఫున 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్‌ సాధించాడు మెస్సీ. 






21ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్ తరఫున ఆడిన మోస్సీకి గత ఆదివారం ఆ క్లబ్ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ మెస్సీ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ రోజు తనకు అత్యంత బాధాకరమైన రోజుగా అభివర్ణిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. ‘నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. అత్యంత బాధాకరమైన క్షణమిది. చాలా కష్టంగా ఉంది. నా జీవితం మొత్తం క్లబ్‌ కోసం ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు చివరి అంకానికి చేరుకున్నా. ఇలా వీడ్కోలు పలుకుతానని ఎప్పుడూ అనుకోలేదు, ఊహించలేదు’అంటూ మెస్సీ భావోద్వేగానికి గురయ్యాడు. 
తనకు వివిధ క్లబ్బుల నుంచి ఆఫర్లు వచ్చాయని చెబుతూనే.. భవిష్యత్‌ గురించి చెప్పేందుకు నిరాకరించాడు. మెస్సీతో తమ కాంట్రాక్టును పునరుద్ధరించలేమని బార్సిలోనా గత గురువారం ప్రకటించింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన నేపథ్యంలో మెస్సీ క్లబ్‌ను వీడాల్సి వచ్చింది. 
ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన వ్యత్యాసాలు, కొన్ని లీగ్‌ల నిబంధనల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఇరువురికి ఒప్పందం కుదరలేదు. అతడి భవిష్యత్తు గొప్పగా కొనసాగాలని బార్సిలోనా క్లబ్ ఆకాక్షించింది. ఇన్నేళ్ల పాటు తమ క్లబ్‌ తరపున సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది బార్సిలోనా క్లబ్. బార్సిలోనా త‌ర‌ఫున అత్య‌ధిక గోల్స్‌, మ్యాచ్‌లు మెస్సీ పేరు మీదే ఉన్నాయి. 






AlsoRead: In Pics Messi Leaves Barcelona: మెస్సీ షాకింగ్ నిర్ణయం... 21 ఏళ్లుగా ఆడుతున్న బార్సిలోనా క్లబ్‌కు గుడ్ బై