Team India World Cup 2023 Strategy: ఈ వరల్డ్ కప్పులో టీమిండియా పది విజయాలు వరుసగా ఎలా సాధించింది? న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ను ఎలా రెండుసార్లు ఓడించింది? ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి భారీ జట్లు కూడా భారత్ కు ఎందుకు తలవొంచాయి. ఆన్సర్ సింపుల్ పక్కా స్ట్రాటజీ. అందరికీ తెలిసిపోయిన స్ట్రాటజీనే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా టీమిండియాను ఎవరూ ఆపలేకపోతున్నారు.
మ్యాచ్ లో పిచ్ కండీషన్స్ బట్టి కుదిరితే ముందు బ్యాటింగ్ చేయాలి. బోర్డు మీద భారీ స్కోరు పెట్టాలి. అది ఎలా మొదటి 10 ఓవర్లలో రోహిత్ శర్మ హిట్టింగ్ చేస్తూనే ఉండాలి. సెల్ఫ్ లెస్ బ్యాటింగ్...నో రికార్డ్స్..నో మైల్ స్టోన్స్. హిట్ మ్యాన్ చెలరేగిపోతున్నాడు. 10 మ్యాచుల్లో 550 పరుగులు చేశాడు. 62 ఫోర్లు, 28 సిక్సర్లు బాదాడు. ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కొట్టినన్ని సిక్సర్స్ మరెవ్వరూ కొట్టలేదు.
స్ట్రాటజీ నెంబర్ 2 విరాట్ కోహ్లీ
తన అగ్రెసివ్ స్టైల్ ను విరాట్ కొంచెం మార్చాడు. నింపాదిగా నిదానంగా ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నాడు. మ్యాగ్జిమం స్ట్రైక్ రొటేట్ చేస్తూ..నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో సైలెంట్ గా ఉండటానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే కోహ్లీకి మ్యాచ్ ను డీప్ కి తీసుకెళ్లే బాధ్యత ఇచ్చినట్లున్నారు. అందుకే మ్యాచ్ ఎండింగ్ వరకూ కోహ్లీ నిలబడటానికి ట్రై చేస్తున్నాడు. ఇది కొంతమందికి కోహ్లీ స్టైల్ మార్చుకున్నాడు. డిఫెన్స్ ఆడుతున్నాడు అన్నట్లు కనపడినా అది పక్కా స్ట్రాటజీ.
మైల్ స్టోన్స్ చూసుకుంటున్నాడనే మాట కంటే అది టీమ్ ప్లేయర్ గా తన బాధ్యతనే అర్థం చేసుకోవాలి. ఒకవేళ మిగిలిన బ్యాటర్లు కనుక ఔట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తుంటే కోహ్లీ మిగిలిన బ్యాటర్లతో కలిసి గేర్ మార్చాలి. టీమ్ ను ఓ సేఫ్ స్కోర్ వరకూ తీసుకెళ్లాలి. బట్ మరీ అలా బ్యాటింగ్ పేక మేడలా కూలిపోయే పరిస్థితులు ఈ వరల్డ్ కప్పులో అంతలా ఎదురుకాలేదు. రోహిత్ ఆడకపోతే కోహ్లీ..కోహ్లీ ఆడకపోతే రాహుల్, ఎవరూ లేదంటే అయ్యర్ ఇలా ప్రతీ ఒక్కరూ బ్యాటింగ్ లో అదరగొడుతున్నారు కాబట్టే టీమిండియా ఎదురు లేకుండా దూసుకెళ్తోంది.
ఇక బౌలింగ్ విభాగం గురించి చెప్పక్కర్లేదు. స్పిన్ పిచ్ లు స్పిన్నర్లు అదరగొడతారు అని ప్రిపేర్ అయిపోయి వచ్చిన ప్రత్యర్థి టీమ్ లు షమికి సమధానం చెప్పుకోలేకపోతున్నాయి. బుమ్రా, సిరాజ్ అవసరమైన సందర్భాల్లో వికెట్లు తీస్తూ ఆదుకుంటున్నారు. స్పిన్ మీద ఏ మాత్రం టర్న్ లభించినా కుల్దీప్, జడేజా చూసుకుంటున్నారు. మ్యాచ్ లో ఎలాంటి పరిస్థితి ఉన్నా చివరికి విజయం టీమిండియా చేతుల్లోకి వచ్చేలా చేస్తున్నారు.
ఆదివారం ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా... అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. 2003 ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇరు దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పును ఒడిసిపట్టాలని చాలా పట్టుదలగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ తప్పదని తేలిపోయింది. మాములుగానే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఇరు దేశాల అభిమానులు ఆ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు.