న్యూజిలాండ్‌పై విజయంతో టీమ్‌ఇండియా అరుదైన రికార్డులు బద్దలుకొట్టింది. వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక టీ20 సిరీసును కైవసం చేసుకుంది. అంతేకాకుండా మూడు మ్యాచులున్న టీ20 సిరీసులకు అత్యధికంగా వైట్‌వాష్‌ చేసింది. ఆరు సిరీసులు గెలిచిన దాయాది పాకిస్థాన్‌ను భారత్‌ సమం చేసింది.


కివీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమ్‌ఇండియా దుమ్మురేపింది. ఈడెన్‌ గార్డెన్‌లో టాస్‌ గెలిచినప్పటికీ మొదట బ్యాటింగ్‌ చేసింది. ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నించింది. రోహిత్‌ శర్మ (56), ఇషాన్‌ కిషన్‌ (29), శ్రేయస్‌ అయ్యర్‌ (25), వెంకటేశ్ అయ్యర్‌ (20), దీపక్‌ చాహర్‌ (21*) దుమ్మురేపారు. ప్రత్యర్థికి 185 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌ 3, హర్షల్‌ పటేల్‌ 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని 17.2 ఓవర్లకు 111 పరుగులకే ఆలౌట్‌ చేశారు. మార్టిన్‌ గప్తిల్‌ ఒక్కడే 51 పరుగులు చేశాడు.


ఎక్కువ వైట్‌వాష్‌లు చేసింది (3+ మ్యాచులు)



  • భారత్‌ - 6

  • పాకిస్థాన్‌ - 6

  • అఫ్గానిస్థాన్‌ - 5

  • ఇంగ్లాండ్‌ - 4

  • దక్షిణాఫ్రికా - 3


భారత్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైన జట్లు



  • 3-0 vs ఆస్ట్రేలియా 2016 (A)

  • 3-0 vs శ్రీలంక 2017 (H)

  • 3-0 vs వెస్టిండీస్‌ 2018 (H)

  • 3-0 vs వెస్టిండీస్‌ 2019 (A)

  • 5-0 vs న్యూజిలాండ్‌ 2020 (A)

  • 3-0 vs న్యూజిలాండ్‌ 2021 (H)






Also Read: Ind vs NZ- 3rd T20, Full Match Highlight: న్యూజిలాండ్‌ను ఉతికేశారు.. 3-0తో సిరీస్ సాధించిన టీమిండియా!


Also Read: Ian Chappell on T20 WC: ప్రపంచకప్‌ టాస్‌ గెలువు కప్పు కొట్టుగా మారిందన్న ఇయాన్‌ ఛాపెల్‌..!


Also Read: Jeremy Solozano Injured: క్రికెట్‌ మైదానంలో విషాదం..! విండీస్‌ ఫీల్డర్‌ తలకు తగిలిన బంతి.. స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలింపు


Also Read: MSD on IPL: సంవత్సరమా.. ఐదేళ్లా.. ఐపీఎల్ కెరీర్‌పై ధోని ఏమన్నాడంటే?


Also Read: MS Dhoni IPL update: ఐపీఎల్‌ 2022 ధోనీ ఆడతాడా? ఆడడా? మళ్లీ మొదలైన రచ్చ..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి