కోచ్‌లు మారుతున్నా సింధు ఆటలో మార్పు రాలేదు. మరో టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరకుండానే వెనుదిరిగింది. పేలవమైన ఆటతీరుతో ఇబ్బంది పడుతున్న సింధు మేజర్ టోర్నీలో ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. 


ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు చాలా విజయాలు సాధించింది. పతకం లేకుండా వచ్చింది లేదు. ఈసారి మాత్రం విజయం లేకుండానే వెనుదిరిగింది. టై బ్రేక్ రావడంతో నేరుగా రెండో రౌండ్‌కు వెళ్లిన సింధు అక్కడ జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహరతో ఓడిపోయింది. కనీసం పోటీ కూడా ఇవ్వలోకపోయింది. 


చాలా కాలంగా ఫామ్‌లేమితో సింధు బాధపడుతున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సక్సెస్‌ ప్లేయర్‌గా ఉన్న సింధు ఇలా పరాజయం పాలవడం ఆమె అభిమానులను నిరాశ పరిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఎక్కడా ఆమె దూకుడుగా ఆడలేపోయింది. 14-21, 14-21తో ఒకుహర చేతిలో ఓటమిపాలయ్యారు. 


అనవసర తప్పిదాలు సింధును ఓడించాయి. ఈ ఇద్దరి ప్లేయర్లు చాలా సార్లు ముఖాముఖీగా తలపడ్డారు. చాలా ఆసక్తికరమైన పోటాపోటీ గేమ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఈసారీ మాత్రం అలాంటి పరిస్థితి కనిపించలేదు. 


పురుషుల సింగిల్స్‌ లో లక్ష్యసేన్, ప్రణయ్‌ మరో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. కొరియా క్రీడాకారుడు జియోన్‌ జిన్‌ తో జరిగిన గేమ్‌లో 21-1, 21-12తో సునాయాసమైన విజయం సాధించాడు లక్ష్యసేన్. ప్రణయ్‌ కూడా ఇండోనేషియా ప్లేయర్‌ చికోద్వివిర్దొయోపై విజయం ఈజీ విక్టరీ సాధించాడు.