బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బాలీవుడ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నా కూడా కంగనాకు తన ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ ఇవ్వలేదు కరణ్. అంతే కాకుండా తనకు వచ్చిన అవకాశాలు కూడా కరణ్ అడ్డుకుంటున్నాడని ఈ భామ పలుమార్లు ఆరోపణలు చేసింది. తాజాగా మరోసారి కంగనా.. తన ట్విటర్‌లో కరణ్ జోహార్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడింది.
‘ఎమర్జెన్సీ’ గురించి కరణ్ ఎగ్జైట్మెంట్..
ప్రస్తుతం కంగనా రనౌత్.. ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఒకప్పుడు ఇందిరా గాంధీ పాలనలో భారతదేశం ఎదుర్కున్న ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే కరణ్ జోహార్ ఈ సినిమాకు తన సపోర్ట్‌ను అందిస్తున్నట్టుగా ప్రకటించాడు. తాజాగా కరణ్ జోహార్.. కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో మామూలుగా తూర్పు, పడమరలాగా ఉండే కరణ్, కంగనాలకు మధ్య అన్నీ ఓకే అయిపోయాయేమో, అందుకే కరణ్.. కంగనా మూవీకి సపోర్ట్ చేస్తున్నాడమో అనుకున్నారు ప్రేక్షకులు. ఇదే విషయాన్ని స్వయంగా ఆ హీరోయిన్‌నే అడిగి తెలుసుకుందామని ట్విటర్‌లో ప్రశ్నించాడు ఒక నెటిజన్. దీంతో కరణ్ సపోర్ట్‌కు తాను ఎలా ఫీలవుతుందో కంగనా బయటపెట్టింది.
చాలా భయంగా ఉంది..
‘‘ఇదివరకు ఆయన ‘మణికర్ణిక’ చిత్రానికి ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. కానీ, ఆ మూవీ రిలీజ్ టైమ్‌లో నాపై అత్యంత చెడు ప్రచారం జరిగింది. దాదాపుగా ఈ సినిమాలో నటించిన అందరు లీడ్ యాక్టర్స్‌కు డబ్బులిచ్చి నాపై బురద చల్లి, నా సినిమాను నాశనం చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారి నా జీవితంలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ వీకెండ్ అనేది పీడ కలలాగా మారిపోయింది. నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. ఎందుకంటే అతడు మళ్లీ ఎగ్జైటెడ్‌గా ఉన్నాడు’’ అంటూ కరణ్ జోహార్ ఎగ్జైట్మెంట్ వెనుక ఉన్న అసలు అర్థమేంటో చెప్పుకొచ్చింది కంగనా రనౌత్.
మూవీ మాఫియా అంటూ కామెంట్స్..
మామూలుగా కంగనాకు, కరణ్‌కు అంత మంచి రిలేషన్ లేదని బాలీవుడ్ ప్రేక్షకులు అందరికీ తెలుసు. కానీ ఆరేళ్ల క్రితం కరణ్ షో ‘కాఫీ విత్ కరణ్’కు వచ్చినప్పుడు ఇన్నాళ్ల కోపం అంతా ఒకేసారి బయటపెట్టినట్టుగా కంగనా మాట్లాడిన మాటలు తెలియని ప్రేక్షకులకు కూడా వీరి గొడవ గురించి క్లారిటీ ఇచ్చాయి. ఆ షోలోనే కంగనా.. కరణ్‌ను మూవీ మాఫియా అంటూ చెప్పుకొచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకు సమయం దొరికినప్పుడల్లా కరణ్ వల్లే బాలీవుడ్‌లో ఇలా జరుగుతుంది అంటూ కామెంట్స్ చేస్తుంది. తాజాగా కరణ్ తెరకెక్కించిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ కలెక్షన్స్ కూడా అంతా అబద్దమని కంగనా.. పలుమార్లు స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక ఈ భామ నటించిన ‘ఎమర్జెన్సీ’.. 2023 నవంబర్ 24న విడుదల అయ్యింది.
Also Read: లావణ్యనే నా ఫోన్ తీసుకుని అలా చేసింది, తనకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గుర్తులేదు: వరుణ్ తేజ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial