Satwiksairaj Rankireddy and Chirag Shetty: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి(Satwiksairaj Rankireddy-Chirag Shetty) జోడీకి షాక్ తగిలింది. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ తుదిపోరులో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆడిన ఆడిన అయిదు ఫైనల్లోనూ వరుస విజయాలు సాధించిన సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి తొలిసారి తుది మెట్టుపై బోల్తా పడింది. చివరివరకూ పోరాడినా... ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించినా ఈ స్టార్ జోడీకి ఓటమి తప్పలేదు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్- చిరాగ్ జంట 19-21, 21-18, 19-21 తేడాతో చైనాకు చెందిన రెండో సీడ్ లియాంగ్- వాంగ్ చేతిలో పోరాడి ఓడింది. గంటా 11 నిమిషాల పాటు సాగిన పోరులో భారత ద్వయం అనవసర తప్పిదాలతో పరాజయం పాలైంది.
తొలి గేమ్ నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తొలి సెట్‌లో భారత జోడీ చేసిన అనవసర తప్పిదాలను కొరియా వినియోగించుకుంది. ఓ దశలో మ్యాచ్ 19-19తో ఉత్కంఠగా మారింది. కానీ చైనా పట్టు వదలకపోవడంతో ప్రత్యర్థి జట్టు వశమైంది. రెండో గేమ్‌లో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ భారత జోడి గెలుచుకుంది. దీంతో నిర్ణయాత్మకమైన మూడో గేమ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఓ దశలో 13-20తో ఓటమి ఖాయమైన స్థితిలో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ నిలిచింది. అయినా పట్టు వదలకుండా పోరాడి వరుసగా ఏడు పాయింట్లు సాధించింది. 19-20తో మ్యాచ్ మళ్లీ ఉత్కంఠగా మారింది. కానీ ఈ సారి చిరాగ్ నెట్‌కు కొట్టడంతో మ్యాచ్ కోల్పోక తప్పలేదు. ఎనిమిదేళ్లలో ఆతిథ్య దేశం చైనాకు ఈ టోర్నీలో ఇదే తొలి పురుషుల డబుల్స్ టైటిల్.
ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడల్లోనూ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో తొలిసారిగా స్వర్ణ పతకం భారత్ కైవసం చేసుకుంది. డబుల్స్ ఫైనల్లో తెలుగు తేజం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జంట కొరియా ఆటగాళ్లు చో సోల్గూ, కిమ్ వోంగూ పై 21-18, 21-16 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు. ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ నెగ్గిన తొలి స్వర్ణం ఇది. తెలుగు తేజం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 58 ఏళ్లలో భారత్ కు తొలి స్వర్ణ పతకం అందించారు. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ లో 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు స్వర్ణం తెచ్చాడు. 1971లో దీపు ఘోష్, రామన్ ఘోష్ జంట డబుల్స్ లో కాంస్య పతకం సాధించారు.
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో పురుషుల డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్న తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ ఈ సీజన్‌లో స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్íÙప్‌లో, ఇండోనేసియా ఓపెన్, కొరియా ఓపెన్‌లలో విజేతగా నిలిచారు. గతంలో భారత్ నుంచి పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకాశ్ పదుకొనే (1980లో), శ్రీకాంత్ (2018లో), మహిళల సింగిల్స్‌లో సైనా నెహా్వల్ (2021లో) ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply