Sania Mirza Retirement Tennis India: దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్ బై చెప్పనుంది. దుబాయ్ డ్యూటీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ వచ్చే నెలలో జరగనుంది. సానియా మీర్జా గత సంవత్సరం యుఎస్ ఓపెన్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. కానీ గాయం కారణంగా ఆమె ఆ టోర్నమెంట్లో ఆడలేకపోయింది. తరువాత ఆమె తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకుంది. సానియా మీర్జా టెన్నిస్ కెరీర్ అద్భుతంగా సాగింది. టెన్నిస్ కోర్టులో అనేక టైటిల్స్ గెలుచుకుంది.


సానియా మీర్జా కెరీర్ ఇదే


సానియా మీర్జా కెరీర్ చూస్తే.. ఈ భారతీయ టెన్నిస్ స్టార్ 6 ప్రధాన ఛాంపియన్ షిప్‌లను గెలుచుకుంది. సానియా మీర్జా 3 సార్లు డబుల్స్ టైటిల్, మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను 3 సార్లు గెలుచుకుంది. ఈ నెలలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సానియా మీర్జా కజకిస్తాన్ భాగస్వామి అన్నా డానిలియాతో కలిసి ఆడింది. సానియా మీర్జా గత పదేళ్లుగా దుబాయ్ లో నివసిస్తోంది. సానియా మీర్జాకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 


ఈ మధ్య విడాకులపై దుమారం 


సానియా మిర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం చక్కర్లు కొట్టింది. ఈ మధ్య సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్ తో కలిసి దిగిన ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి 2023 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. 2022 సంవత్సరానికి సంబంధించి కొన్ని అందమైన సెల్ఫీలు తన వద్ద ఉన్నప్పటికీ చెప్పుకొదగ్గ శీర్షిక లేదని రాసింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పింది. 2022 మొదట్లో చాలా సమస్యలున్నా చివరిలో అన్ని సర్ధుకొని మంచే జరిగిందని పేర్కొంది.