నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 సినిమా తెరకెక్కుతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా నిర్మాతలు ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఫస్ట్‌లుక్‌ను క్రికెట్ మ్యాచ్‌ల ప్రచారానికి కూడా వాడేస్తున్నారు.
ఇందులో బాలకృష్ణ లుక్‌ను రోహిత్‌కు ఆపాదిస్తూ... స్టార్ స్పోర్ట్స్ తెలుగు కొత్త ఫొటోను విడుదల చేసింది. ఇందులో #NBK107 ఫస్ట్‌లుక్‌లో బాలయ్య గెటప్‌లో ఉన్న రోహిత్ శర్మను చూడవచ్చు. అంతేకాకుండా దీనికి క్యాప్షన్‌గా ‘Hit కొట్టాలంటే బాలయ్య... 6 కొట్టాలంటే Hitmanయే భయ్యా!’ అని క్యాప్షన్ పెట్టడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
దీనికి మైత్రీ మూవీ మేకర్స్, గోపిచంద్ మలినేని కూడా స్పందించి రిప్లై ఇచ్చారు. #NBK107 హ్యాష్‌ట్యాగ్‌కు ఫైర్ ఎమోజీని జోడించి వారు రిప్లైలు ఇచ్చారు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్ ఆడుతోంది. ఈ సిరీస్‌కు ప్రచారం కల్పించేందుకు స్టార్ స్పోర్ట్స్ తెలుగు #NBK107ను ఎంచుకుంది.