భీమ్లా నాయక్ ( Bheemla Naik ) సినిమా ప్రదర్శనలకు ఏపీ ప్రభుత్వం ( AP Governament ) ఆటంకాలు కల్పించడంపై అనంతపురం తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ( JC Prabhakar Reddy ) మండిపడ్డారు. సినీ పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సీఎం జగన్‌కు ( CM Jagan ) సూచించారు. భీమ్లా నాయక్ సినిమా పై కక్ష సాధిస్తున్నారని నిబంధనలన్నీ ఆ సినిమాకేనా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్  మంచి వ్యక్తి,  ఆయనపై కక్ష సాధించడం విచారకరమన్నారు. పవన్ కల్యాణ్ ను ( Pawan Kalyna ) టార్గెట్ చేశారు.. అయినా ఆయనకు ఏమీ కాదన్నారు.  ఈగో నీకు ఒక్కడికే కాదు అందరికీ ఉంది.. పవన్ కల్యాణ్ కీ ఉంటుందని జేసీ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 


తనను కేసుల్లో ఇరికించి ఏం చేశారని.. ఏమీ చేయలేవని జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. చిరంజీవి ( Chiranjeevi ) చేతులు జోడించి అడిగారని... ఆయన బతకలేక నీదగ్గరకు రాలేదన్నారు.  సినిమా పరిశ్రమ ( Tollywood ) కోసం వచ్చారని గుర్తు చేశారు. చరంజీవి లాంటి పెద్ద మనిషి.. సినీ పరిశ్రమ కోసం ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్న వీడియోలను పదేపదే టెలికాస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమన్నారు. 


భీమ్లా నాయక్‌ను అడ్డుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ ను ఇంకా ఎక్కువ ఫేమస్ చేసినట్టు అవుతుందని విశ్లేషించారు.  భీమ్లానాయక్ సినిమాను అడ్డుకోవడం వలన 18 శాతం ఉన్న కాపు ఓట్లను ( Kapu Votes ) ప్రభుత్వం కోల్పోయిందని తేల్చేశారు. పోలీసులను , తహసీల్దార్ లను సినిమా థియేటర్ దగ్గర ఉంచి సినిమా ప్రదర్శనలను నిలిపి వేసే కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. ఇక నుంచి ఏ హీరో, డైరెక్టర్ రాష్ట్రంలో సినిమా తీయరని... టాలీవుడ్ సినీ పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేశారని మండిపడ్డారు. 


సినిమా టికెట్ల ధరల ( Movie Ticket Rates ) తగ్గింపుకు   వ్యతిరేకం కాదు.. కానీ ముందే చెప్పాలి కదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అదే ఎవడబ్బ సొమ్మని తిరుమలలో ( Tirumala ) టికెట్ల ధరలు పెంచుతున్నారని ప్రశ్నించారు. తిరుమల దేవస్థానం ( TTD ) హిందువులదని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు దర్శనం రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు.