తెలంగాణ ప్రజల గుండెల్లో టీఆర్ఎస్(TRS) ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavita) అన్నారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముజిబుద్దీన్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాల నుంచి టీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్నారు. తెలంగాణ(Telangana)కు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసిన సీఎం కేసీఆర్(Kcr) ఉద్యమాన్ని ముందుకు నడిపించారన్నారు. టీఆర్ఎస్ పార్టీని నమ్మిన ప్రజలు పట్టంకట్టారన్నారు. అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను రెండు సార్లు సీఎం చేశారన్నారు. టీఆర్ఎస్ పార్టీ 70 లక్షల సభ్యతాలకు చేరుకుందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ న్యాయం, ధర్మం వైపే ఉంటుదని కవిత స్పష్టం చేశారు.
గత రెండేళ్లుగా కరోనా ఉన్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రేషన్ బియ్యంతో సహా ఇతర పథకాలు అమలు చేశామని ఎమ్మెల్యే కవిత తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వలస కార్మికులను ఆదుకోలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రైతులకు అన్నం పెడుతుంటే మోదీ సున్నం పెడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం పట్టుబడుతోందన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ఎంపీ(TRS MPs)లు పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. కానీ బీజేపీ ఎంపీల తీరు ఇందుకు భిన్నంగా ఉందన్నారు. పేద ప్రజల కోసం కేవలం టీఆర్ఎస్ మాత్రమే పోరాడుతుందన్నారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించిందన్నారు.
కేంద్ర బడ్జెట్(Budget)లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తే బీజేపీ నేతలు ఇప్పటి వరకూ సమాధానం చెప్పలేదన్నారు. మాయమాటలు చెప్పడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, రైతులను, పేదలను మోసం చేయడంలో బీజేపీ నంబర్ వన్ అని కవిత విమర్శించారు. మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ సహనాన్ని, మంచితనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. దిల్లీ దాకా వచ్చి బీజేపీ సంగతేంటో చూస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.
Also Read: Karimnagar: బీజేపీలో రహస్య సమావేశాల కలకలం, కరీంనగర్ సీనియర్ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి!