రెడ్‌మీ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే రెడ్‌మీ నోట్ 9 ప్రోకు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయిందని చెప్పవచ్చు. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌ను అందించారు. 5020 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది.


రెడ్‌మీ నోట్ 10 లైట్ ధర


ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.15,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గానూ నిర్ణయించారు. అరోరా బ్లూ, షాంపేన్ గోల్డ్, గ్లేసియర్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 తగ్గింపు లభించనుంది.


Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ.4 వేలకు పైగా తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్!


రెడ్‌మీ నోట్ 10 లైట్ స్పెసిఫికేషన్లు


ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.  ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఇందులో ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ మొబైల్‌లో 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు కూడా నాలుగు కెమెరాల సెటప్‌ను అందించారు. వీటిలో 48 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న ప్రధాన కెమెరాను అందించారు. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


బ్యాటరీ సామర్థ్యం 5020 ఎంఏహెచ్ గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 4జీ వోల్టే, వైఫై 802.11ac, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఇందులో అందించారు. ఫోన్ కింద భాగంలో రెండు స్పీకర్లు, నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 209 గ్రాములుగా ఉంది.


Also Read: హోం అప్లయన్సెస్‌పై భారీ ఆఫర్లు.. ఇంట్లో వస్తువులు కొనడానికి రైట్ టైం!


Also Read: ఫర్నీచర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు ఆఫర్లు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి