RCB vs DC Score LIVE: ఆఖరి బంతికి సిక్సర్‌తో బెంగళూరును గెలిపించిన భరత్, ఏడు వికెట్లతో ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్‌ 2021 ఆఖరి లీగు మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతోంది. ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌ చేరుకున్నాయి. పంత్‌ సేనపై గెలవాలని కోహ్లీసేన భావిస్తోంది.

ABP Desam Last Updated: 08 Oct 2021 11:12 PM
ఆఖరి బంతికి సిక్సర్‌తో బెంగళూరును గెలిపించిన భరత్, ఏడు వికెట్లతో ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీ

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్సర్‌తో బెంగళూరు గెలిపించిన తెలుగు తేజం శ్రీకర్ భరత్(76). ఢిల్లీపై ఏడు వికెట్లతో బెంగళూరు విజయం

14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 96-3

బెంగళూరు 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ కూడా అవుటయ్యాడు. మ్యాక్స్‌వెల్(17), శ్రీకర్ భరత్(45) క్రీజులో ఉన్నారు.

9 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 54-2

బెంగళూరు 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(4), దేవ్ దత్ పడిక్కల్(0) అవుటయ్యారు. ఏబీ డివిలియర్స్(26), శ్రీకర్ భరత్(21) క్రీజులో ఉన్నారు.

ఛేదనలో తొలి ఓవర్లోనే వికెట్‌ కోల్పోయిన బెంగళూరు: లక్ష్యం 165


బెంగళూరు ఛేదన ఆరంభించింది. తొలి ఓవర్లో నాలుగు పరుగులు చేసి వికెట్‌ చేజార్చుకుంది. ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. నార్జ్ వేసిన నాలుగో బంతికి అతడు అశ్విన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. విరాట్‌ కోహ్లీ (3), శ్రీకర్‌ భరత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు.

20 ఓవర్లకు దిల్లీ 164-5.. బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించిన బెంగళూరు

దిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసింది. 20 ఓవర్లకు ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి హెట్‌మైయిర్‌ (29) ఔటయ్యాడు. రిపల్‌ పటేల్‌ (7) అతడికి తోడుగా నిలిచాడు. మహ్మద్‌ సిరాజ్‌ 2 వికెట్లు తీశాడు. చాహల్‌, హర్షల్‌, క్రిస్టియన్‌ తలో వికెట్‌ తీశారు.

పట్టు బిగించిన బెంగళూరు.. 18 ఓవర్లకు దిల్లీ 148-4

బెంగళూరు కట్టుదిట్టంగా బంతులేస్తోంది. దిల్లీ మరో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ వేసిన 17.4వ బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ (18) ఔటయ్యాడు. రిపల్‌ పటేల్‌ (1) క్రీజులోకి వచ్చాడు. హెట్‌మైయిర్‌ (21) నిలకడగా ఆడుతున్నాడు.

పోటీలోకి బెంగళూరు.. 15 ఓవర్లకు దిల్లీ 128-3

బెంగళూరు కాస్త కోలుకుంది. వికెట్లు తీస్తోంది. దాంతో దిల్లీ 15 ఓవర్లకు 128-3తో నిలిచింది. షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (13), శ్రేయస్‌ అయ్యర్‌ (9) నిలకడగా ఆడుతున్నారు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి పంపిస్తున్నారు. డాన్‌ క్రిస్టియన్‌ వేసిన 12.4వ బంతికి రిషభ్ పంత్‌ (10) ఔటయ్యాడు. శ్రీకర్ భరత్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

ఓపెనర్లు ఔట్‌.. అర్ధశతకాలు మిస్‌.. 12 ఓవర్లకు దిల్లీ 105-2


దిల్లీ 12 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. హర్షల్‌ పటేల్‌ వేసిన 10.1 బంతికి ధావన్‌ (43: 35 బంతుల్లో 3x4, 2x6),  యుజ్వేంద్ర చాహల్‌ వేసిన 11.2వ బంతికి పృథ్వీ షా (48: 31 బంతుల్లో 4x4, 2x6) ఔటయ్యారు. రిషభ్ పంత్‌ (8), శ్రేయస్‌ అయ్యర్‌ (1) నిలకడగా ఆడుతున్నారు.

తగ్గేదే లే.. 9 ఓవర్లకు దిల్లీ 77-0

వికెట్లు తీసేందుకు ఆర్‌సీబీ బౌలర్లు  కష్టపడుతున్నారు. అయినప్పటికీ దిల్లీ ఓపెనర్లు పట్టు విడవడం లేదు. తొమ్మిది ఓవర్లకు తొలి వికెట్‌కు 77 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. ధావన్‌ (39), షా (33) పోటీ పడి షాట్లు ఆడుతున్నారు. పరుగులు వరద పారిస్తున్నారు.

దంచికొడుతున్న ధావన్‌, పృథ్వీషా.. పవర్‌ప్లేలో దిల్లీ 55-0

దిల్లీ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (27), పృథ్వీ షా (24) జోరు పెంచారు. పవర్‌ప్లేలో  చివరి మూడు ఓవర్లలో బౌండరీలు బాదేశారు. వీరిద్దరూ చెరో మూడు బౌండరీలు కొట్టేశారు. ధావన్‌ ఓ సిక్సర్‌ కూడా అందుకున్నాడు. గార్టన్‌ కాస్త తక్కువ పరుగులే ఇచ్చినా మాక్సీ మాత్రం ఎక్కువ పరుగులే ఇచ్చాడు.

దూకుడుగా దిల్లీ ఓపెనర్లు..

దిల్లీ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. శిఖర్‌ ధావన్‌ (13), పృథ్వీ షా (10) నిలకడగా ఆడుతున్నారు. ధావన్‌ రనౌట్‌ ప్రమాదం తప్పించుకున్నాడు. అయితే రెండు చక్కని బౌండరీలు బాదేశాడు. మాక్స్‌వెల్ చక్కగా బౌలింగ్‌ చేశాడు. 3 ఓవర్లకు దిల్లీ వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచిన కోహ్లీ

దిల్లీతో జరుగుతున్న మ్యాచులో బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ టాస్ గెలిచాడు. మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. జట్టులో మార్పులేమీ చేయలేదు.

Background

ఐపీఎల్‌ 2021 ఆఖరి లీగు మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతోంది. ఇప్పటికీ ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌ చేరుకున్నాయి. పంత్‌ సేనపై గెలిచి రన్‌రేట్‌ మెరుగు పర్చుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. ప్రస్తుతం దిల్లీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 13 మ్యాచుల్లో 10 గెలిచి 20 పాయింట్లతో ఉంది. ఆర్‌సీబీ ఎనిమిది గెలిచి 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచినా బెంగళూరు రెండో స్థానానికి చేరుకోవడం కష్టం. చెన్నై భారీ రన్‌రేట్‌తో ఉండటమే కారణం.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.