Nadal Into French Open Final : రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ లో ప్రత్యర్థి చీలమండ గాయంతో వైదొలగడంతో రఫెల్ నాదల్ ఫైనల్ కు చేరుకున్నాడు. తన 36వ పుట్టినరోజున ఆడుతున్న నాదల్ ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో అత్యంత ఓల్డెస్ట్ ఛాంపియన్‌గా అవతరించే అవకాశాన్ని పొందాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను నాదల్ 13 సార్లు గెలుచుకున్నాడు. కాలికి గాయమైన తర్వాత, నాదల్ ప్రత్యర్థి జ్వెరెవ్ వీల్ చైర్‌లో క్లే కోర్ట్ నుండి బయటకు వెళ్లడం కలిపించింది.
చీలమండ గాయం కారణంగా రెండో సెట్‌లో సెమీ ఫైనల్ ప్రత్యర్థి అలెగ్జాండర్ జ్వెరెవ్ వైదొలగడంతో 13 సార్లు ఛాంపియన్ రాఫెల్ నాదల్ 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్నాడు. నాదల్ 7-6 (8), 6-6తో ఆధిక్యంలో ఉండగా, జ్వెరెవ్ చీలమండలో గాయం అయింది. ఈ గాయం నొప్పితో జ్వెరెవ్ ఆటను కొనసాగించలేకపోయాడు. ప్రపంచ 3వ ర్యాంక్ ఆటగాడు జ్వెరెవ్‌ను వీల్‌ఛైర్‌లో కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు.