PV Sindhu Wins Olympics FirstMatch: పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్‌పై అలవోకగా విజయం సాధించింది. సింధుకు మొదటి నుంచి ఏ దశలోనూ ఆమె పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 29 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియగా సింధు 21 - 9, 21 - 6 తేడాతో  గెలుపొందింది. ఇక గ్రూప్ స్టేజ్‌లో బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాతో సింధు తలపడనున్నారు.

రోయింగ్‌లో భారత అథ్లెట్ సత్తా

మరోవైపు, రోయింగ్‌లోని రిపెఛేజ్ విభాగంలో భారత అథ్లెట్ బాల్‌రాజ్ పన్వార్ సత్తా చాటారు. రెండో రౌండ్‌లో అద్భుత ప్రదర్శన చేసి క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాడు. మొనాకో అథ్లెట్ క్వింటిన్ ఆంటోగ్నెల్లి తొలి స్థానంలో నిలవగా.. రెండో స్థానంతో బాల్‌రాజ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.

Also Read: Paris Olympics 2024: ప్రపంచ ఛాంపియన్‌ అయినా భర్తే కదా, సారీ మై లవ్‌ అంటూ భార్యకు క్షమాపణ