Sindhu wins Swiss Open: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్(Swiss Open Badminton) టోర్నీని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ లో థాయ్ లాండ్(Thailand) ఫ్లేయర్ బుసానన్ పై ఘన విజయం సాధించింది. ఫైనల్ లో 21-16, 21-8 తేడాతో పీవీ సింధు గెలుపొందింది. ఇటీవల జర్మన్ ఓపెన్(German Open), ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ లో ఓడిన పీవీ సింధు తాజాగా స్విస్ ఓపెన్ లో తిరుగులేని విజయాలు సాధించింది. ఇవాళ్టి ఫైనల్‌లో బుసానన్‌పై 21-16, 21-8తేడాతో సింధు విజయం సాధించి టైటిల్ ను గెలుచుకుంది. 49 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో సింధు ఆధిపత్యం చేలాయించింది. దీంతో ఈ ఏడాది సింధు ఖాతాలో రెండు టైటిల్స్ చేరాయి. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీని పీవీ సింధు గెలుచుకుంది. ఈ విజయంతో సింధు థాయ్ ప్లేయర్‌పై 16-1తో హెడ్-టు-హెడ్ రికార్డును సొంతం చేసుకుంది.
Also Read : IPL 2022: ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డ్ - వయసు అయిపోయింది అనేవాళ్లు ఇది తెలుసుకోండి
తొలి గేమ్ నెక్-టు-నెక్ ఫైట్
తొలి గేమ్‌లో 3-0తో ఆధిక్యంలో నిలిచిన సింధు ఫైనల్‌లో శుభారంభం చేసింది. కానీ థాయ్ షట్లర్ 3-3తో గేమ్‌ను సమం చేసింది. మొదటి గేమ్ హోరాహోరీగా సాగింది. 9-9 స్కోరుతో సమానంగా ఉన్న సమయంలో ప్రత్యర్థిని బోల్తా కొట్టించి రెండు పాయింట్లు సాధించింది దీంతో మొదటి విరామానికి 11-9 ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత 16-15తో ఇరువురి మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరిగింది. కానీ సింధు ఆ తర్వాత తన అనుభవంతో మొదటి గేమ్‌ను చేజిక్కించుకోవడానికి ఆరు పాయింట్లలో చివరి ఐదు పాయింట్లను గెలుచుకుంది. మిడ్-గేమ్ విరామానికి తొమ్మిది పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించిన సింధు రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. రెండో గేమ్‌ను 21-8తో సింధు సునాయాసంగా గెలుచుకుంది.
Also Read : IND W vs SA W: డూ ఆర్ డై మ్యాచు: చిన్న మిస్టేక్‌తో సెమీస్‌కు దూరమైన మిథాలీ సేన