Just In
మూడేళ్లుగా నేను సింగిల్, ఆ వ్యక్తి కోసం ఆలుపరాటా తిన్నా: డేటింగ్ రూమర్స్‌పై శుభ్‌మన్ గిల్
పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఇరుజట్లకు చెరో పాయింట్, ప్రభ్ సిమ్రాన్, ప్రియాంశ్ మెరుపులు వృథా
చెన్నై దుస్థితికి కారణాలివే..! ఆ తప్పులను సరిదిద్దు కోలేదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే దాదాపుగా ఔట్!!
Thala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలు
CSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSK
Kavya Maraan Expression vs CSK IPL 2025 | హావభావాలతో మ్యాచ్ టెన్షన్ మొత్తం చూపించిన కావ్యామారన్
Praggnanandhaa: ప్రజ్ఞానంద కొత్త చరిత్ర, విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించిన నయా ఛాంపియన్
Praggnanandhaa : చెస్ సంచలనం, యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లోనే తొలిసారి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి భారత టాప్ ర్యాంకర్‌గా అవతరించాడు.
Continues below advertisement
ఆనంద్‌ను దాటేసిన ప్రజ్ఞానంద ( Image Source : Twitter )
చెస్ సంచలనం, యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద(Praggnanandhaa) చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లోనే తొలిసారి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్( Viswanathan Anand) ను దాటి భారత టాప్ ర్యాంకర్‌గా అవతరించాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్, చైనాకు చెందిన చెస్ దిగ్గజం డింగ్ లిరెన్(Ding Liren)ను ఓడించడంతో ఈ ఘనత అందుకున్నాడు. దీంతో ఇండియన్ నెంబర్ వన్ ర్యాంక్‌ను ప్రజ్ఞానందా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను మాజీ ఛాంపియన్ ఆనంద్‌ను దాటేశాడు. ప్రజ్ఞా విజయం పట్ల గర్వంగా ఉందని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం..
ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. విశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12 స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో భారత్ తరఫున టాప్ ప్లేయర్‌గా ఈ యువ గ్రాండ్‌మాస్టర్ అగ్రస్థానంలోకి ఎగబాకాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత.. క్లాసికల్ చెస్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా నిలిచాడు. భారత నంబర్ వన్ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద అవతరించడంపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రశంసలు కురిపించారు. ఇవి అద్భుతమైన క్షణాలని.... ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి ఈ ఘనత అందుకున్నావని... నిన్ను చూసి ఈ దేశం గర్వపడుతోందన ప్రజ్ఞానందను ఉద్దేశించి గౌతమ్ అదానీ ట్వీట్ చేశాడు. ప్రజ్ఞానందకు ఆర్థికంగా అండగా ఉంటామని ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించింది. గతేడాది జరిగిన చెస్ ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద కొద్దిలో టైటిల్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయినా ఫైనల్‌లో దిగ్గజ ఆటగాడు కార్ల్‌సన్‌కు గట్టి పోటీనిచ్చి అందరి మనసులు గెల్చుకున్నాడు. 5 సంవత్సరాల వయస్సులో ఆడటం ప్రారంభించిన ప్రజ్ఞానంద.. 2018లో 12 సంవత్సరాల వయస్సులో భారతదేశపు అతి పిన్న వయస్కుడిగా, ప్రపంచంలోని రెండో అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. అభిమన్యు మిశ్రా, సెర్గీ కర్జాకిన్, గుకేష్ డి, జావోఖిర్ సిందరోవ్ తర్వాత గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ఐదో పిన్న వయస్కుడిగా నిలిచాడు. ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా గ్రాండ్‌మాస్టరే.
చెస్ ప్రపంచకప్ ఫైనల్లో నిరాశ
ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత కుర్రాడు ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలవాలన్న అతని కల నెరవేరలేదు. టై బ్రేకర్ పోరులో ప్రజ్ఞానంద ఓడిపోయాడు. తొలిరౌండ్ తొలిగేమ్‌లో ప్రజ్ఞానందపై కార్ల్‌సన్ విజయం సాధించగా.. రెండో గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో ప్రజ్ఞానందకు ఓటమి తప్పలేదు. అయితే ఫైనల్‌లో ఓడిపోయినా అందరి మనసులు గెల్చుకున్నాడు ప్రజ్ఞానంద. గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత..తర్వాత ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్న భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఫైనల్‌లో వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో పోటాపోటీగా తలపడ్డాడు. ప్రపంచకప్‌లో ఫైనల్ ఆడిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు ప్రజ్ఞానంద్. టైటిల్ మ్యాచ్‌లో కార్ల్‌సెన్‌కు గట్టి పోటీ ఇచ్చాడు.
Continues below advertisement