ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్‌) 12వ సీజన్ ఆటగాళ్ల వేలం విజయవంతంగా ముగిసింది. 2 రోజలు పాటు జరిగిన బిడ్డింగ్ వార్‌లో 12 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. పీకేఎల్ మొదటి రోజు వేలంలో 10 మంది ఆటగాళ్లు కోటి రూపాయలు పైగా పలికారు. రెండుసార్లు ట్రోఫీ నెగ్గిన మహ్మద్‌రెజా షాద్లూయి రూ.2.23 కోట్లకు గుజరాత్ జెయింట్స్‌ జట్టు తీసుకుంది. దేవాంక్ దలాల్ రూ. 2 కోట్ల క్లబ్‌లో చేరాడు. పీకేఎల్ 11లో బెస్ట్ రైడర్‌గా నిలిచిని దేవాంక్ దలాల్‌ను బెంగాల్ వారియర్స్‌ రూ. 2.205 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో  పీకేఎల్ వేలం (PKL Auction)లో ఐదో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

కొత్తగా ప్రవేశపెట్టిన ఫైనల్ బిడ్ మ్యాచ్ (FBM) నిబంధనను రెండో రోజు సైతం ఫ్రాంచైజీలు ఉపయోగించుకున్నాయి. తద్వారా ఆటగాళ్లకు లభించే చివరి వేలం బిడ్ ధరను చెల్లించి ఒకటి లేదా రెండు సీజన్ల పాటు ఆటగాళ్లను తీసుకోవడానికి జట్టుకు అనుమతిఇచ్చింది. దీపక్ సింగ్ (పట్నా పైరేట్స్), అషు మాలిక్ (దబాంగ్ ఢిల్లీ), హర్‌దీప్, ఘన్‌శ్యామ్ రోకా మగర్ (హర్యానా స్టీలర్స్), మహ్మద్‌ అమాన్ (పుణెరి పల్టాన్), ను ఆయా జట్లూ ఎఫ్‌బీఎం ద్వారా  2 సీజన్ల వీరిని అట్టిపెట్టుకున్నాయి. మరో 9 మంది ఆటగాళ్లను ఒక సీజన్ కోసం అట్టిపెట్టుకున్నాయి.

తొలి రోజే పది మందిపై కోట్ల వర్షం కురవగా, 10 మంది ఆటగాళ్లు 10వ సీజన్ కంటే రెట్టింపు సంఖ్యలో రూ. కోటి పైనే పలికారు. ఎఫ్బీఎం నిబంధనతో  ఐదుగురు ఆటగాళ్లు రెండు సీజన్లకు రిటైన్‌ చేసుకున్నారు. కేటగిరి-ఎ ఆరంభ, చివరి బిడ్లతో రూ. 2 కోట్ల క్లబ్‌లో మహమ్మద్‌రెజా షాద్లూయి, దేవాంక్ దలాల్ చేరారు. కేటగిరీ-డి లో అనిల్ మోహన్‌ కోసం రూ. 78 లక్షల బిడ్‌తో యు ముంబా ఆశ్చర్యపరిచింది. యోగేష్ దహియా రూ. 1.125 కోట్లతో పీకేఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన భారతీయ డిఫెండర్‌గా నిలిచాడు. పీకేఎల్ 12 ప్లేయర్స్ ఆక్షన్‌లో మొత్తం రూ. 37.90 కోట్లు ఖర్చు చేశారు.

కేటగిరీ–సి లో మెరిసిన ఆల్‌రౌండర్లుకేటగిరీ–సి ఆల్‌రౌండర్లకు మంచి అవకాశం లభించింది.  గుర్దీప్, నితిన్ రావల్, ధీరజ్ వంటి ఆటగాళ్లు పెద్ద మొత్తం పలికారు. జైపూర్ పింక్ పాంథర్స్‌ నితిన్ ను రూ. 50 లక్షలకు తీసుకోగా,  గుర్దీప్‌ను పుణెరి పల్టాన్ రూ. 47.10 లక్షలకు, ధీరజ్ రూ. 40.20 లక్షలతో బెంగళూరు బుల్స్ తీసుకుంది. ఈ కేటగిరీలో రైడర్ ఆకాష్ షిండే అత్యధికంగా రూ. 53.10 లక్షల బిడ్‌ తో బెంగళూరు బుల్స్‌ కు వెళ్లాడు.

కేటగిరీ–డి లో అత్యధిక బిడ్‌తో అనిల్ మోహన్ సంచలనంఈ వేలంలో యు ముంబా జట్టు అనిల్ మోహన్ ను రూ. 78 లక్షల భారీ మొత్తంతో దక్కించుకుంది. ఇది పీకేఎల్ చరిత్రలో కేటగిరీ–డి లో అత్యధిక బిడ్ కావడం విశేషం. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ రెండు కేటగిరీలలో అత్యధిక బిడ్‌ పొందాడు. మరోవైపు ఉదయ్ పార్టే ను కేటగిరీ–డి లో రూ. 50.10 లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్ రెండో అత్యధిక బిడ్‌ తో కొనుగోలు చేసింది.

ఆటగాళ్ల వేలంపై మాషల్ స్పోర్ట్స్ బిజినెస్ హెడ్, ప్రొ కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి హర్షం వ్యక్తం చేశారు. ‘పీకేఎల్ 12వ సీజన్‌ ఆటగాళ్ల వేలం బాగా జరిగింది. రెండో రోజున కూడా ఉత్సాహంగా కొనసాగింది. జట్లు కేటగిరీ సి, డి ఆటగాళ్లపై చాలా ఆసక్తి చూపించాయి. అరంగేట్ర ఆటగాడు అనిల్ మోహన్ రూ.78 లక్షలు పలికాడు. కేటగిరీ–డిలో ఇదే అత్యధిక ధర. ఈ సీజన్‌లో 10 మంది ఆటగాళ్లు కోటీశ్వరులు అయ్యారు. పాత ఆటగాళ్లతో పాటు కొత్త ప్రతిభను కూడా గుర్తించి, వారికి మంచి బిడ్డింగ్ వేశారు’ అని అనుపమ్ గోస్వామి పేర్కొన్నారు. 

అనిల్ మోహన్  వేలం ముగిసిన తర్వాత తరువాత మాట్లాడుతూ.. ‘ఎట్టకేలకు పీకేఎల్‌లో భాగం కాబోతున్నాను. యు ముంబా జట్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. యు ముంబాకు కృతజ్ఞతలు. జట్టుపై నాదైన ముద్ర వేస్తాను. యు ముంబా  గతంలో చాలా మంది రైడర్లను ప్రోత్సహించింది. ఈ లీగ్‌లో ఆడటం కల నిజం చేసింది. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని’ చెప్పాడు.  

12వ సీజన్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు కేటగిరీ– ఎ టాప్‌5 ఆటగాళ్లు:-  మహమ్మద్‌రెజా షాద్లూయి చియనే (ఇరాన్): రూ.2.23 కోట్లు – గుజరాత్ జెయింట్స్ -  దేవాంక్ దలాల్ (భారత్): రూ.2.203 కోట్లు – బెంగాల్ వారియర్జ్ -  ఆషు మాలిక్ (భారత్): రూ.1.90 కోట్లు – దబాంగ్ ఢిల్లీ -  అర్జున్ దేశ్వాల్ (భారత్): రూ.1.405 కోట్లు – తమిళ్ తలైవాస్ -  యోగేష్ బిజేందర్ దహియా (భారత్): రూ.1.125 కోట్లు – బెంగళూరు బుల్స్ 

కేటగిరీ బి టాప్‌5 ఆటగాళ్లు:-  అంకిత్ జాగ్లాన్ (భారత్): రూ.1.573 కోట్లు – పట్నా పైరేట్స్ -  నవీన్ సంసార్ సింగ్ కుమార్ (భారత్): రూ.1.20 కోట్లు – హర్యానా స్టీలర్స్ -  గుమన్ సింగ్ (భారత్): రూ.1.073 కోట్లు – యూపీ యోధాస్ -  సచిన్ తన్వర్ (భారత్): రూ.1.058 కోట్లు – పుణెరి పల్టాన్ -  నితిన్ కుమార్ ధంఖర్ (భారత్): రూ.1.002 కోట్లు – జైపూర్ పింక్ పాంథర్స్ 

కేటగిరీ సి టాప్5 ఆటగాళ్లు:-  ఆకాష్ సంతోష్ షిండే (భారత్): రూ.53.10 లక్షలు – బెంగళూరు బుల్స్ -  నితిన్ రావల్ (భారత్): రూ.50 లక్షలు – జైపూర్ పింక్ పాంథర్స్ -  సందీప్ కుమార్ (భారత్): రూ.49 లక్షలు – యు ముంబా -  గుర్‌దీప్ (భారత్): రూ.47.10 లక్షలు – పుణెరి పల్టాన్ -  ధీరజ్ (భారత్): రూ.40.20 లక్షలు – బెంగళూరు బుల్స్ 

కేటగిరీ డి టాపర్లు:-  అనిల్ మోహన్ (భారత్): రూ.78 లక్షలు – యు ముంబా -  ఉదయ్ పార్టే (భారత్): రూ.50.10 లక్షలు – జైపూర్ పింక్ పాంథర్స్ -  శుభం బిటాకే (భారత్): రూ.9.10 లక్షలు – బెంగళూరు బుల్స్ .