టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత షూటర్ అవని లేఖరా మరో పతకాన్ని సాధించారు. ఇటీవల స్వర్ణ పతకం సాధించిన అవని.. తాజాగా జరిగిన మహిళ 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్1 ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేశారు. 445.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన అవని లేఖరా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ సోమవారం షూటింగ్ విభాగంలో అవని లేఖరా బంగారు పతకం సాధించడం తెలిసిందే. అయితే, పారాలింపిక్స్‌లో ఓ భారత మహిళ బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. సోమవారం తెల్లవారు జామున జరిగిన మ్యాచ్‌లో అవని లేఖరా బంగారు పతకం గెలిచి పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పారు. తాజాగా 50 మీటర్ల విభాగంలో కాంస్యం నెగ్గడం ద్వారా ఈ పారాలింపిక్స్ ద్వారా జైపూర్‌కు చెందిన అవని లేఖరా రెండు రికార్డులు తన పేరిట లిఖించుకున్నారు. పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళ అవని కాగా.. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు కొల్లగొట్టిన తొలి భారత అథ్లెట్‌గా ఆమె నిలిచారు.
Also Read: Praveen Kumar Wins Silver Medal: భారత్ ఖాతాలో మరో పతకం.. హై జంప్‌లో ప్రవీణ్ కుమార్‌కు రజతం
పారాలింపియన్, భారత షూటర్ అవని లేఖరా విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పారా ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాలు నెగ్గడం చాలా సంతోషంగా ఉందన్నారు. అవని లేఖరా అద్భుత ప్రదర్శన చేసి మరో పతకాన్ని కైవసం చేసుకుంది. కాంస్యం సాధించిన అవనికి అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. షూటర్ అవనీ కాంప్య పతకంతో కలిపితే టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 12కు చేరింది. భారత్ రెండు బంగారు పతకాలు, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కొనసాగుతోంది.
Also Read: IND vs ENG, 1st Innings Highlights: ముగిసిన తొలి రోజు ఆట... ఇంగ్లాండ్ 53/3 ... భారత్ 191 ఆలౌట్