పారాలింపిక్స్ 2020 లో భారత్ మరో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 19 ఏళ్ల మనీష్ నర్వాల్ పసిడి సాధించాడు. మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్స్‌లో ప్రత్యర్థిని ఓడించి మనీష్ పసిడి పట్టాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌కు 14వ పతకం వచ్చినట్లయింది. ప్రపంచ షూటింగ్ పారా స్పోర్ట్ ర్యాంకింగ్స్ ప్రకారం మనీష్ నర్వాల్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇక ఇదే ఈవెంట్‌లో సింఘరాజ్‌కు సిల్వర్ మెడల్ దక్కడం విశేషం. దీంతో పారాలింపిక్స్‌లో ఇండియా పతకాల సంఖ్య 15కు చేరింది. మహిళల షూటింగ్ ఈవెంట్‌లో అవని రెండు మెడల్స్ సాధించిన సంగతి తెలిసిందే.
50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో షూటర్ మనీశ్ 218.2 పాయింట్ల స్కోర్ చేశాడు. దీంతో అతను పారాలింపిక్స్‌లో కొత్త చరిత్ర నెలకొల్పాడు. ఇది పారాలింపిక్స్‌లో రికార్డుగా నిలిచింది. అంతేకాకుండా ప్రపంచ రికార్డు కూడా మనీశ్ ఖాతాలోనే ఉండడం మరో విశేషం. మరో షూటర్ సింగరాజ్ ఈ ఈవెంట్‌లో 216.7 పాయింట్లు స్కోర్ చేశారు. సింగరాజ్‌కు ఈ గేమ్స్‌లో ఇది రెండవ మెడల్.
మరోవైపు, పతకాలు గెలిచిన ఈ క్రీడాకారులకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ, మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు అభినందిస్తున్నారు.