Vinesh Phogat Disqualification: వినేశ్‌ ఫోగట్‌పై అనర్హతా వేటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెజ్లింగ్‌లో భారత్‌కి పతకం ఖాయం అనుకుంటున్న సమయంలో ఈ వార్త షాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ సహా పలువురు దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వందగ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారన్న కారణంగా ఈ పోటీ నుంచి తప్పించారు. అయితే..ఈ నిబంధనపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రకటనపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్పందించింది. వినేశ్ ఫోగట్‌పై అనర్హతా వేటు పడిందని చెప్పేందుకు చాలా చింతిస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేమని వెల్లడించింది. బరువు తగ్గించుకునేందుకు రాత్రంతా ఎంతో కష్టపడిందని, అయినా ఇలా జరిగిందని అసహనం వ్యక్తం చేసింది. అయితే.. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం ఏ అథ్లెట్ అయినా నిర్దేశించిన బరువు లేకపోతే వెంటనే అనర్హత వేటు వేస్తారు. ఈ నిర్ణయం తీసుకోగానే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)తో పాటు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ కాస్త సమయం ఇవ్వాలని అక్కడి నిర్వాహకులను కోరాయి. కానీ అందుకు వాళ్లు అంగీకరించలేదు. 


"మేం చాలా ప్రయత్నించాం. కాస్తంత సమయం ఇవ్వాలని కోరాం. ప్రత్యామ్నాయ మార్గమేమైనా ఉందా అని అడిగాం. కానీ వాళ్లు దేనికీ ఒప్పుకోలేదు. రూల్స్ ప్రకారం నడుచుకోక తప్పదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో వాళ్లు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. మాకు చాలా తక్కువ సమయం ఉంది. అందుకే రాత్రంతా బరువు తగ్గేందుకు ట్రైనింగ్ ఇచ్చాం. ఫోగట్ చాలా కష్టపడింది. ఈ క్రమంలోనే డీహైడ్రేషన్‌కి గురైంది. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటోంది. భారత్‌ గోల్డ్ మెడల్ కోల్పోయిందని చాలా బాధ పడుతున్నాం. మన అథ్లెట్స్ ఎంతో కష్టపడి ఇక్కడి వరకూ వచ్చారు. కనీసం 2-3 మెడల్స్ అయినా రావాలని కోరుకుంటున్నాను"


- సంజయ్ సింగ్, WFI ప్రెసిడెంట్ 


 






వినేశ్‌కి పెరుగుతున్న మద్దతు..


ఇప్పటికే ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కచ్చితంగా కుట్ర జరిగిందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇండియన్ ఒలిపింక్ అసోసియేషన్‌ని అలెర్ట్ చేశారు. వేరే ఆపషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలని ఆదేశించారు. IOA ప్రెసిడెంట్ పీటీ ఉషతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి వినేశ్ ఫోగట్‌కి మద్దతు పెరుగుతోంది.


Also Read: Vinesh Phogat: వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై రాజకీయ రగడ, కచ్చితంగా కుట్రేనన్న వాదనలు