Paris Olympic 2024 India Athletes Day2 Schedule: భారీ అంచనాలు, ఆశలు, పతకం తప్పక గెలుస్తుందన్న నమ్మకం మధ్య స్టార్ బాక్సర్, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్, తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్( Nikhat Zareen) నేడు తొలి మ్యాచ్ ఆడనుంది. ఉమెన్స్ 50 కిలోల విభాగంలో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనాతో జరీన్ అమీతుమీ తేల్చుకోనుంది. రింగ్‌లో దిగితే ప్రత్యర్థి బాక్సర్లకు బొమ్మ కనిపించేలా చేసే నిఖత్ ఈ మ్యాచ్‌లో విజయంపై కన్నేసింది. ఈ ఒలింపిక్స్‌లో నిఖత్‌కు కఠినమైన డ్రా వచ్చింది. అయినా ఎలాంటి బాక్సర్‌ను అయినా చిత్తు చేయగల నేర్పు నిఖత్‌కు ఉంది. మరోసారి ప్రపంచ ఛాంపియన్‌లా నిలిచి ప్రత్యర్థులను చిత్తు చేస్తే పతకం భారత్ ఖాతాలో చేరడం ఖాయమే. లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా... కామన్వెల్త్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతక విజేతగా ఉన్న నిఖత్... అదే ఊపు, జోరు కొనసాగిస్తే పతకం తప్పక గెలిచే అవకాశం ఉంది. పంచ్ ప్యాక్ చేసి సిద్ధంగా ఉన్నానని తొలి మ్యాచ్‌కు ముందు నిఖత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. " పారిస్.. నేను ఈరోజు కోసమే నేను ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నాను. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. ఈ క్షణాలను మర్చిపోలేనివిగా మార్చుకుంటాను. హృదయాలను గెలుచుకుంటాను. నా కలను నెరవేర్చుకోవడానికి పంచ్ ప్యాక్ చేసి సిద్ధంగా ఉన్నాను. ఇక పదండి వెళ్దాం" అంటూ నిఖత్ పోస్ట్ చేసింది.
మంచి రికార్డులే
గత ఏడాది మార్చిలో 50 కిలోల విభాగంలో నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2022 బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో స్వర్ణం కూడా సాధించింది. హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ఒలింపిక్స్‌లో నిఖత్ కఠినమైన డ్రా వచ్చింది. తొలి మ్యాచ్‌లో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనాతో జరీన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆసియా క్రీడల ఛాంపియన్ చైనాకు చెందిన వు యుతో నిఖత్ తలపడే అవకాశం ఉంది. వు యు మహిళల 50 కిలోల విభాగంలో టాప్ సీడ్ బాక్సర్. ఈ చైనా గోడను కూలిస్తే నిఖత్ క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన చుతామత్ రక్షత్ లేదా ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సబీనా బొబోకులోవాతో తలపడవచ్చు. ఈ ఫిబ్రవరిలో నిఖత్.. ఓ టోర్నమెంట్‌లో ఉజ్బెక్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది.
నేటి భారత షెడ్యూల్
టేబుల్ టెన్నిస్: ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్ (శ్రీజ × క్రిస్టినా, మనిక × హర్సీ)
మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్ (శరత్ × డెని కొజుల్)
షూటింగ్
10మీ.ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ (మనుబాకర్)-
10మీ.ఎయిర్ రైఫిల్ అర్హత పోటీలు మహిళలు (వలరివన్, రమిత)
10మీ.ఎయిర్ రైఫిల్ అర్హత పోటీలు పురుషులు (సందీప్, అర్జున్)
ఆర్చరీ
మహిళల జట్టు క్వార్టర్స్ (అంకిత, దీపిక, భజన్)-
బ్యాడ్మింటన్
మహిళల సింగిల్స్ (సింధు × ఫాతిమాత్)
పురుషుల సింగిల్స్ (ప్రణయ్ × ఫాబియన్)-
రోయింగ్
పురుషుల సింగిల్ స్కల్స్ రెపిఛేజ్-2 (బాల్‌రాజ్)
స్విమ్మింగ్
పురుషుల 100మీ.బ్యాక్‌స్ట్రోక్ హీట్-2 (శ్రీహరి)
మహిళల 200మీ.ఫ్రీస్టైల్ హీట్-1 (ధినిధి దేశింగు)
బాక్సింగ్
మహిళల 50 కేజీలు మొదటి రౌండ్ (నిఖత్ × మ్యాక్సీ కరీన)