Paris 2024 Olympics India schedule, August 5 Monday: పారిస్ ఒలింపిక్స్(Paris 2024 Olympics)లో ఇవాళ భారత్‌కు పతకం వచ్చే అవకాశం ఉంది. కాంస్య పతక పోరులో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్(Lakshya Sen) మలేషియాకు చెందిన లీ జి జియాతో తలపడనున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో ఉన్న లక్ష్య సేన్... ఏడో ర్యాంక్‌లో ఉన్న లీ జి జియా మధ్య కాంస్య పతక పోరు జరగనుంది. ఈ ఇద్దరి మధ్య ఇప్పటివరకూ అయిదు మ్యాచ్‌లు జరగగా... లీ జిజియా నాలుగు, లక్ష్య ఒక మ్యాచ్ గెలిచారు.
ఇవాళ భారత అథ్లెటిక్స్ ఈవెంట్స్‌తో పాటు రెజ్లింగ్(wrestling) కూడా ఆరంభం కానుంది. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ క్వాలిఫైయింగ్ ఈవెంట్‌లో అవినాష్ సేబుల్ బరిలో దిగనున్నాడు. 12 మంది రేసర్లు బరిలో ఉండగా తొలి అయిదు స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్ చేరుతారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15 స్థానంలో ఉన్న అవినాష్ సేబుల్ ఈ రేస్‌లో సత్తా చాటాలని చూస్తున్నాడు. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో సేబుల్ రజత పతకాన్ని సాధించాడు. షూటింగ్, సెయిలింగ్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్ ఈవెంట్‌లలోనూ ఇవాళ భారత్ పోటీపడనుంది.
మహిళల డింగీ స్టాండింగ్స్‌లో ప్రస్తుతం 25వ స్థానంలో ఉన్న నేత్ర కుమానన్ బరిలో దిగనుంది. భారత షూటర్లు, మిక్స్‌డ్ స్కీట్ టీమ్ ఈవెంట్‌లో పోటీ పడనున్నారు. అనంత్‌జీత్ సింగ్ నరుకా-మహేశ్వరి చౌహాన్‌లతో కూడిన భారత మిక్స్‌డ్ స్కీట్ జట్టు క్వాలిఫైయింగ్ రౌండ్‌ల్లో బరిలో దిగనుంది. భారత రెజ్లింగ్ కూడా నేడు ఆరంభం కానుంది. మహిళల 68 కేజీల రౌండ్ 16లో నిషా దహియా... ఉక్రెయిన్‌కు చెందిన టెటియానా ఎస్ రిజ్ఖోతో తలపడనుంది. మహిళల టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులు మనిక బాత్రా- శ్రీజ అకుల, మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు నాయకత్వం వహిస్తారు.
ఇవాళ్టీ భారత షెడ్యూల్
అథ్లెటిక్స్
మహిళల 400 మీటర్ల హీట్ 5 – కిరణ్ పహల్ - 3:57 PM
పురుషుల 3000మీ స్టీపుల్‌చేజ్ హీట్ 2 – అవినాష్ సేబుల్ - 10:50 PM
బ్యాడ్మింటన్
పురుషుల సింగిల్స్ కాంస్య పతక మ్యాచ్ - లక్ష్య సేన్ vs లీ జి జియా 6:00 PM
సెయిలింగ్
మహిళల డింగీ రేసు 9 - నేత్ర కుమనన్ - 3:45 PM
మహిళల డింగీ రేసు 10 - నేత్ర కుమనన్ - 4:53 PM
పురుషుల డింగీ రేసు 9 - విష్ణు శరవణన్ - 6:10 PM
పురుషుల డింగీ రేసు 10 - విష్ణు శరవణన్ - 7:15 PM
షూటింగ్
స్కీట్ మిక్స్‌డ్ టీమ్ అర్హత - అనంతజీత్ సింగ్ నరుకా/మహేశ్వరి చౌహాన్ - 12:30 PM స్కీట్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్ (అర్హత సాధిస్తే)- నరుకా/మహేశ్వరి- 6:30 PM స్కీట్ మిక్స్‌డ్ టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (అర్హత సాధిస్తే) - నరుకా/మహేశ్వరి
టేబుల్ టెన్నిస్
మహిళల టీమ్ ఈవెంట్ రౌండ్ ఆఫ్ 16 - ఇండియా vs రొమేనియా - మధ్యాహ్నం 1:30
రెజ్లింగ్
మహిళల 68 కేజీల రౌండ్ 16 - నిషా దహియా vs టెటియానా ఎస్ రిజ్ఖో- 6:30 PM మహిళల 68 కేజీల క్వార్టర్ ఫైనల్స్ - (అర్హత సాధిస్తే) - సాయంత్రం 6:30 తర్వాత మహిళల 68 కేజీల సెమీ-ఫైనల్ - (అర్హత సాధిస్తే) - 12:30 AM