హాకీ జట్టు కూడా...
మరోవైపు భారత హాకీ టీమ్ కూడా నేడు పతక అవకాశాలను పరీక్షించుకోనుంది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా హాకీ టీమ్... గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించి మంచి ఫామ్‌లో కనిపిస్తున్న ఇండియా హాకీ జట్టు... ఇప్పుడు బ్రిటన్‌కు కూడా షాక్ ఇచ్చి సెమీస్ చేరి పతక పోరు ఆడాలని భావిస్తోంది. ఇక అథ్లెటిక్స్‌లోనూ భారత పోరు నేడు ఆరంభం కానుంది. మరో క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా బోర్గోహైన్ నేడు బరిలోకి దిగనుంది. లవ్లీనా పతకం తెస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే లవ్లీనా సెమీస్‌లోకి దూసుకెళ్లి పతక పోరుకు సిద్ధం కానుంది.
ఇవాళ్టీ భారత షెడ్యూల్
గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 4 (శుభంకర్ శర్మ -గగన్‌జీత్ భుల్లర్)- 12:30 PM
షూటింగ్
25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాలిఫికేషన్-స్టేజ్ 1 (విజయ్‌వీర్ సిద్ధూ -అనీష్) - 12:30 PM
25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాలిఫికేషన్-స్టేజ్ 2 (విజయ్‌వీర్ సిద్ధూ-అనీష్)- 4:30 PM
మహిళల స్కీట్ క్వాలిఫికేషన్ - (మహేశ్వరి చౌహాన్, రైజా ధిల్లాన్)- 1 PM:
మహిళల స్కీట్ ఫైనల్( అర్హత సాధిస్తే)- (మహేశ్వరి చౌహాన్, రైజా ధిల్లాన్_7 PM
హాకీ
పురుషుల క్వార్టర్ ఫైనల్స్ (భారత్ vs గ్రేట్ బ్రిటన్)-1:30 PM
అథ్లెటిక్స్
మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రౌండ్ (పరుల్ చౌదరి)-1:35 PM
పురుషుల లాంగ్ జంప్ క్వాలిఫికేషన్ (జెస్విన్ ఆల్డ్రిన్)-2:30 PM
బాక్సింగ్
మహిళల 75 కేజీల క్వార్టర్‌ఫైనల్స్ (లవ్లీనా బోర్గోహైన్ vs లి కియాన్)- 3:02 PM
బ్యాడ్మింటన్
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ లక్ష్య సేన్ vs విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) 3:30PM
సెయిలింగ్
పురుషుల డింగీ రేస్ 7 అండ్ 8-(విష్ణు శరవణన్) 3:35 PM
మహిళల డింగీ రేస్ 7 అండ్ 8 (నేత్ర కుమనన్)- 6:05 PM