Neeraj Chopra Net Worth And Car Collections: నీరజ్ చోప్రా(Neeraj Chopra)... ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ఈటెగాడు.. భారత్‌కు వరుసగా రెండో పతకాన్ని అందించి తన పేరును చరిత్ర పుస్తకాల్లో స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే అసలు నీరజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం.. పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన ఈ స్టార్ అథ్లెట్.. ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. రూ. 37 కోట్ల సామ్రాజ్యం నీరజ్ సొంతం. 2024 నాటికి నీరజ్ చోప్రా ఆస్తుల విలువ రూ. 37 కోట్లని ఒక అంచనా. టోర్నమెంట్‌లలో విజయాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా నీరజ్ ఆస్తులు భారీగా పెరిగాయి.
స్టార్ బ్రాండ్ అంబాసిడర్: నీరజ్.. నైక్, గాటోరేడ్, టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్, CRED వంటి అనేక ఉన్నత-ప్రొఫైల్ బ్రాండ్‌లకు యాడ్‌లు చేస్తున్నాడు.
నీరజ్ విహారానికి లగ్జరీ కార్లు: రేంజ్ రోవర్ స్పోర్ట్, ఫోర్డ్ ముస్టాంగ్ GT, టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా థార్, మహీంద్రా XUV700 వాహనాలు నీరజ్ దగ్గర ఉన్నాయి.
ఖరీదైన బైకులు: హార్లే-డేవిడ్‌సన్ 1200 రోడ్‌స్టర్m బజాజ్ పల్సర్ 220ఎఫ్ సహా ఎన్నో బైక్స్ కూడా నీరజ్ గ్యారేజ్‌లో ఉన్నాయి.
టోర్నమెంట్‌ల ద్వారా కూడా... టోర్నమెంట్‌లలో పాల్గొనడం ద్వారా కూడా నీరజ్ సంపాదిస్తాడు. ఇవే కాకుండా ఒలింపిక్ పతకాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు నీరజ్‌కు భారీగా నజరానా ప్రకటించాయి.
కోహ్లీ తర్వాత మనోడే: టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తర్వాత బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా దేశంలో అత్యధికంగా సంపాదించే రెండో అథ్లెట్ నీరజే.
ఏటా నాలుగు కోట్లు ఫీజులే: నీరజ్ చోప్రా జీతం, మ్యాచ్ ఫీజు కలిపి ఏటా దాదాపు రూ.4 కోట్లు వస్తాయి. ఈ మొత్తం అతని మొత్తం నికర ఆస్తులు కేవలం 10 శాతం మాత్రమే.
తొలి పసిడికి భారీ నజరానాలు: హర్యానా ప్రభుత్వం నుంచి రూ. 6 కోట్లు, రైల్వే నుంచి రూ. 3 కోట్లు, పంజాబ్ ప్రభుత్వం రూ. 2 కోట్లు, ఎడ్ టెక్ కంపెనీ BYJU నుంచి రూ. 2 కోట్లు, బీసీసీఐ రూ. 1 కోటి నీరజ్‌కు వచ్చాయి.
ప్రభుత్వ ఉద్యోగి కూడాప్రభుత్వం నీరజ్ చోప్రాకు గ్రూప్-ఎ ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించింది, ఇండిగో ఎయిర్‌లైన్స్ ఏడాది పొడవునా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఇచ్చింది.
ఇవికాక ఒమేగా, ప్రాక్టర్ & గాంబుల్, మొబిల్ ఇండియా, లిమ్కా, మజిల్‌బ్లేజ్ వంటి అనేక ఇతర ప్రముఖ బ్రాండ్‌లకు కూడా నీరజ్ చోప్రానే అంబాసిడర్.