Celebraties congratulated The Indian Hockey Team: ఒలింపిక్స్‌( Olympics )లో వరుసగా రెండోసారి కాంస్య పతకంతో మెరిసిన భారత హాకీ(Indian Hockey) జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశం మొత్తం ఇండియన్‌ హాకీ టీం సాధించిన ఘనతతో సంబరాల్లో మునిగిపోయింది. భారత రాష్ట్రపతి నుంచి కీలక నేతలు అందరూ భారత హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. దిగ్గజ క్రికెటర్ల నుంచి సామాన్య అభిమాని వరకు భారత హాకీ జట్టు విశ్ర క్రీడల్లో వరుసగా రెండో పతకం సాధించడంతో పండుగ చేసుకుంటున్నారు. ఈ అపురూప విజయం సాధించిన తర్వాత భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో డ్యాన్స్‌లతో ఇరగదీశారు. తన చివరి మ్యాచ్‌ ఆడిన శ్రీజేష్‌... సూపర్‌ డ్యాన్స్‌తో దుమ్ములేపాడు.





 

ప్రముఖుల సందేశాలు..

విశ్వ క్రీడల్లో వరుసగా రెండో పతకం సాధించిన భారత హాకీ జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించినందుకు మన హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. ఐదు దశాబ్దాల తర్వాత భారత్ వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించడం గర్వకారణమని రాష్ట్రపతి అన్నారు. భారత హాకీ పూర్వ వైభవం దిశగా పయనిస్తోందని రాష్ట్రపతి అన్నారు. భారత హాకీ జట్టు భారత దేశాన్ని గర్వపడేలా చేసిందని కొనియాడారు. ఇండియన్‌ హాకీ టీం నైపుణ్యాలు, సమన్వయం, పోరాట పటిమ.. యువతకు స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి అన్నారు. 





 

ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. కెప్టన్‌ హర్మన్‌ ప్రీత్‌తో సహా చివరి మ్యాచ్‌ ఆడిన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌తో మోదీ ప్రత్యేకంగా సంభాషించారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ నాయకత్వంపై మోదీ ప్రశంసలు కురిపించారు. భారత హాకీ స్వర్ణ యుగం వస్తుందని మోదీ అన్నారు. స్వర్ణ కాలాన్ని మీరు తిరిగి తీసుకువస్తారని తాను విశ్వసిస్తున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

శ్రీజేష్‌ ఓ కంచు కోటని కొనియాడారు.  









ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌, రెండు ఒలింపిక్‌ పతకాల విజేత మనూ బాకర్‌,  మహ్మద్‌ కైఫ్‌, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నేహ్వాల్‌,, భారత జట్టుకు అభినందనలు తెలిపారు.