India's Full Schedule At Paris Olympics 2024, August 6: భారత క్రీడాభిమానులు పతకం తెస్తారని భారీగా ఆశలు పెట్టుకున్న గోల్డెన్‌ బాయ్ నీరజ్‌ చోప్రా( Neeraj Chopra),  రెజ్లర్ వినేష్ ఫోగాట్(Vinesh Phogat)  నేడు బరిలోకి దిగనున్నారు. వీరిపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో వీరు ఎలా రాణిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న నీరజ్‌ చోప్రా నేడు జరిగే క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో అర్హత సాధించి ఫైనల్‌ చేరడం తేలిగ్గానే కనిపిస్తోంది. 84 మీటర్లు ఈటె విసిరితే ఫైనల్లో బెర్తు ఖాయం కాగ... నీరజ్‌ చోప్రా బెస్ట్‌ త్రోనే 89 మీటర్లు. ఈ ఏడాది కూడా నీరజ్‌ ఓసారి 88 మీటర్లకుపైగా ఈటెను విసిరి మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరో జావెలిన్‌ త్రోయర్‌ కిషోర్‌ కుమార్‌ జెనా కూడా నేడు బరిలోకి దిగుతున్నాడు. గ్రూప్‌ ఏలో ఉన్న కిషోర్‌ కుమార్‌ జెనాపైన భారీ అంచనాలు ఉన్నాయి. జెనా కూడా ఫైనల్‌కు దూసుకెళ్తే భారత్‌కు డబులు బొనాంజ దక్కినట్లే. 

 

మరోవైపు భారత హాకీ జట్టు కూడా నేడు  సెమీస్‌లో ప్రపంచ ఛాంపియన్‌ జర్మనీతో అమీతుమీ తేల్చుకోనుంది. గత ఒలింపిక్స్‌లో జర్మనీకి షాక్ ఇచ్చి కాంస్య పతకాన్ని గెలుచుకున్న హర్మన్‌ సేన మరోసారి ఆ ఫలితాన్ని పునారవృతం చేయాలని పట్టుదలగా ఉంది. హాకీ జట్టు ఫైనల్‌ చేరితే 1980 తర్వాత ఆ ఘనత సాధించిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. రెజ్లింగ్‌లో పతక ఆశతో ఉన్న వినేష్ ఫోగట్ నేడు మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో తలపడనుంది. భారీ అంచనాల మధ్య వినేష్‌ ఫోగట్ నేడు బరిలోకి దిగనుంది. 

 

మహిళల 400 మీటర్ల ఈవెంట్‌లో పహల్ కిరణ్ సెమీఫైనలే లక్ష్యంగా... నేడు రెపెచేజ్ రౌండ్‌లో తలపడనుంది. టేబుల్ టెన్నిస్‌లో పురుషుల టీమ్ ఈవెంట్‌లో చైనాతో భారత్‌ తలపడనుంది. రౌండ్ ఆఫ్ 16లో శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్ బృందం... చైనా టాప్-సీడ్ ఫ్యాన్ జెండాంగ్, మా లాంగ్, వాన్ఫ్గ్ చుకిన్‌తో తలపడనుందియ 

 

ఇవాళ్టీ భారత షెడ్యూల్‌ ఇదే

 

టేబుల్ టెన్నిస్ 

పురుషుల టీమ్ రౌండ్ ఆఫ్ 16 - భారత్ vs చైనా 1:50 PM 

 

అథ్లెటిక్స్ 

పురుషుల జావెలిన్ త్రో( క్వాలిఫై రౌండ్‌)- కిషోర్ జెనా 2:50 PM

పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ B - నీరజ్ చోప్రా 4:20 PM 

 

అథ్లెటిక్స్ 

మహిళల 400 మీ రెపెచేజ్ రౌండ్ - కిరణ్ పహల్ 2:30 PM

 

రెజ్లింగ్ 

మహిళల ఫ్రీస్టైల్ 50kg - వినేష్ ఫోగాట్ vs యుయ్ సుసాకి (జపాన్‌) 3:20 PM

మహిళల ఫ్రీస్టైల్ 50kg (క్వార్టర్‌ ఫైనల్స్‌) -వినేష్ ఫోగట్ (అర్హత సాధిస్తే) 10:25/10:35 PM

మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల (సెమీఫైనల్ )- వినేష్ ఫోగట్ (అర్హతసాధిస్తే) 10:30 PM

 

హాకీ

ఇండియా vs జర్మనీ ( 10:30 PM‌)