ICC Unveils Qualification Pathway For Los Angeles Olympics:  లాస్ ఏంజిల్స్ వేదికగా జరగబోయే 2028 ఒలింపిక్స్ గేమ్స్ లో క్రికెట్ క్వాలిఫికేషన్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సోమవారం ఒక మైండ్ బ్లోయింగ్ రోడ్‌మ్యాప్ రిలీజ్ చేసింది. దాదాపు ఒక సెంచరీ (100 ఏళ్లు) తర్వాత ఒలింపిక్స్ లోకి క్రికెట్ రీఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ లో నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్‌మెంట్ కనిపిస్తోంది. ఈ మెగా ఈవెంట్ లో మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో కేవలం ఆరు చొప్పున టీమ్స్ మాత్రమే పోటీ పడనున్నాయి. దీనికోసం ఐసీసీ క్వాలిఫికేషన్ రూల్స్ ను చాలా కఠినంగా డిజైన్ చేసింది. ఇండియా మెన్స్ టీమ్ ఒలింపిక్స్ కు డైరెక్ట్ గా క్వాలిఫై అవ్వాలంటే 2026 ఎండ్ నాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఆసియా ఖండంలోనే నంబర్ వన్ ప్లేస్ లో నిలవాల్సి ఉంటుంది.

Continues below advertisement

Continues below advertisement

 

మెన్స్ టీమ్స్ కు ర్యాంకింగ్ గడువు.. ఉమెన్స్ రేసులో లండన్ వరల్డ్ కప్ సెంటిమెంట్మెన్స్ క్రికెట్ లో వేర్వేరు ఖండాల నుంచి టాప్ లో ఉన్న నాలుగు బెస్ట్ టీమ్స్ కు ఒలింపిక్స్ కోటా స్లాట్స్ దక్కనున్నాయి. ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆయా ఖండాల నేషనల్ ఒలింపిక్ కమిటీలకు (NOC) ఈ ప్లేసెస్ అలకేట్ చేస్తారు. దీనికోసం కట్-ఆఫ్ డేట్ ను డిసెంబర్ 31, 2026 గా ఐసీసీ ఫిక్స్ చేసింది. మరోవైపు ఉమెన్స్ క్రికెట్ లో ప్రెజెంట్ ఇంగ్లాండ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ముగిసే సమయానికి వేర్వేరు ఖండాల నుంచి టాప్ లో నిలిచే నాలుగు టీమ్స్ కు ఎర్లీ స్లాట్స్ దక్కుతాయి. ఈ క్రైటీరియా ప్రకారం ఆల్రెడీ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ చేరిన ఆస్ట్రేలియా (ఓషియానియా), సౌతాఫ్రికా (ఆఫ్రికా), ఇంగ్లాండ్ (యూరప్) ఒలింపిక్స్ బెర్త్‌లను దాదాపు ఖరారు చేసుకున్నాయి.

Read Also: Kavya Maran Wedding: అనిరుధ్‌తో కావ్య మారన్ మ్యారేజ్ పుకార్లకు చెక్‌! అసలు విషయం ఏంటంటే?

వెస్టిండీస్ కు ఒలింపిక్స్ నో ఎంట్రీ.. ఐసీసీ కొత్త రీజనల్ ప్లాన్ఈ క్వాలిఫికేషన్ రేసులో వెస్టిండీస్ ఉమెన్స్ టీమ్ కూడా సెమీఫైనల్స్ చేరినప్పటికీ వారికి ఒక పెద్ద లీగల్ చిక్కు ఎదురైంది. ఐసీసీ లో వెస్టిండీస్ ఒక కాంపోజిట్ మెంబర్ గా ఉన్నప్పటికీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) లో దానికి ఒక సింగిల్ ఎంటిటీగా గుర్తింపు లేదు. వెస్టిండీస్ లో ఆంటిగ్వా బార్బుడా, బార్బడోస్, గయానా, జమైకా, ట్రినిడాడ్ టొబాగో లాంటి 12 వేర్వేరు కరీబియన్ దేశాల ఒలింపిక్ కమిటీలు ఉన్నాయి. కాబట్టి వెస్టిండీస్ ఒకే టీమ్ గా ఒలింపిక్స్ లో ఆడేందుకు వీల్లేదు. ఒకవేళ గ్లోబల్ క్వాలిఫైయర్ రేసులో వెస్టిండీస్ టాప్ లో ఉంటే, ఆ కరీబియన్ రీజియన్ నుంచి ఏ దేశం ఒలింపిక్స్ లో రిప్రెజెంట్ చేయాలో డిసైడ్ చేయడానికి ఐసీసీ ఒక స్పెషల్ వెస్టిండీస్ నేషన్స్ రీజనల్ టోర్నమెంట్‌ను ఆర్గనైజ్ చేయనుంది.

హోస్ట్ యూఎస్ఏ కు డైరెక్ట్ బెర్త్ఒలింపిక్స్ ఆతిథ్య దేశం అయిన యూఎస్ఏ (USA) మెన్స్, ఉమెన్స్ టీమ్స్ కు ఐసీసీ డైరెక్ట్ గా ఒక కోటా ప్లేస్ ను గ్యారెంటీ చేసింది. క్వాలిఫికేషన్ పీరియడ్ లో యూఎస్ఏ టీమ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ 15 లోపు ఉండాలనే కండిషన్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయడం వల్లే వారికి ఈ ఛాన్స్ దక్కింది. మిగిలిన లాస్ట్ ఒక్క స్లాట్ కోసం ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ (FOGQT) ను ఐసీసీ సెపరేట్ గా కండక్ట్ చేయనుంది. ర్యాంకింగ్స్ ద్వారా క్వాలిఫై అవ్వని నెక్స్ట్ ఎనిమిది బెస్ట్ టీమ్స్ ఈ టోర్నీలో చావో రేవో పోరాడాల్సి ఉంటుంది. ఐసీసీ చైర్మన్ జై షా మాట్లాడుతూ.. "ఒలింపిక్స్ లో క్రికెట్ రీఎంట్రీ ఒక ల్యాండ్‌మార్క్ మూమెంట్. ఈ క్వాలిఫికేషన్ పాత్‌వే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐసీసీ మెంబర్స్ కు ఒలింపిక్ స్టేజ్ పై తమ టాలెంట్ ను చూపించడానికి ఒక క్లియర్ అండ్ ఎగ్జైటింగ్ రూట్ ఇస్తుంది" అని జై షా గర్వంగా చెప్పాడు.